ఈ మధ్యకాలంలో స్టార్ డైరెక్టర్ లు తమ సినిమా బాగా హిట్ అవ్వాలి అని సినిమాకి కొత్త లుక్ తీసుకురావాలి అని.. హీరోల చేత డూప్ లెకుండా భారీ రిస్క్ అయిన షాట్ లల్లో నటింప జేస్తున్నారు . చాలామంది స్టార్స్ ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు . కాగా ఇప్పుడు బుచ్చిబాబు సన కూడా అదే విధంగా చేస్తున్నట్లు ఓ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న బుచ్చిబాబు సన ఉప్పెన మూవీ ద్వారా డైరెక్టర్ గా బాగా క్రేజ్ సంపాదించుకున్నారు . ఉప్పెన  సినిమా ఎంత పెద్ద హిట్ అయింది అనేది అందరికీ తెలిసిందే . ఇప్పుడు రామ్ చరణ్ తో  ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా పేరు "పెద్ది".


ఈ సినిమాకి సంబంధించిన ఏ అప్డేట్ లీక్ అయిన రిలీజ్ అయిన ఫ్యాన్స్ హంగామా మామూలుగా ఉండదు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో లీక్ అయింది . అయితే ఇది మొత్తం కూడా మట్టి తుఫానుల కనిపిస్తుంది . ఈ సినిమా క్లైమాక్స్ సీన్ కోసం ఈ విధంగా సెట్ లో మట్టి తుఫాను వచ్చేలా క్రియేట్ చేశాడు బుచ్చిబాబు సనా అంటూ ఓ న్యూస్ బయటకు వచ్చింది . ఇక్కడ మీరు చూస్తున్న ఈ వీడియోలో ఏదో మట్టి తుఫాను వచ్చినట్లుగా పది అడుగుల ఎత్తు మట్టి పైకి లేయడం గమనించొచ్చు .



అయితే సడన్గా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు షాక్ అయిపోతున్నారు.  ఇదెక్కడి మట్టీ తుఫాను ..? ఎక్కడ వచ్చింది..? అంటూ ఆరా తీస్తున్నారు . పెద్ది సినిమా సెట్ లో అని తెలియగానే ఏదో పెద్ద డేంజర్ బెల్స్ మోగినంత స్థాయిలో భయపడి పోతున్నారు . ఇంత పెద్ద మట్టి తుఫాను వచ్చిందా..? అంటూ టెన్షన్ పడుతున్నారు.  మా హీరో రామ్ చరణ్ బాగానే ఉన్నాడుగా అంటూ కామెంట్స్ పెడుతున్నారు . అయితే ఇది మొత్తం అరేంజ్ చేసిన మట్టి తుఫాను . పెద్ది సినిమా క్లైమాక్స్ సన్నివేశం అదిరిపోయే రేంజ్ లో ఉంటుంది . దాదాపు 30 నిమిషాల పాటు రాంచరణ్ ని పూనకాల వచ్చినట్లు మనం చూసేయొచ్చు .



దానికోసమే బుచ్చిబాబు సనా ఈ విధంగా ఒక భారీ ఫైట్ సీన్ ను చిత్రీకరించడానికి అన్ని రెడీ చేసుకున్నారు.  మట్టి తుఫాను క్లైమాక్స్ కే హైలెట్గా మారిపోతుందట . అయితే చాలామంది "పెద్ది" సినిమా కోసం వెయిట్ చేస్తుంటే మరికొందరు మాత్రం బుచ్చిబాబు ఏం పెంట పని చేస్తున్నాడు .. రామ్ చరణ్ కెరియర్ని రిస్క్ లో పెట్టాడుగా ..? పది అడుగుల మట్టి తుఫానులో రామ్ చరణ్ నటిస్తే ఖచ్చితంగా ఆయనకి ఏదైనా అపాయం జరగొచ్చు .. కనీసం డూప్ పెట్టి  ఈ సన్నివేశాలను క్లియర్ చేసేయ్ అంటూ బుచ్చిబాబుకి సలహా ఇస్తున్నారు .



మరికొందరు మాత్రం ఈ సినిమా ఖచ్చితంగా రాంచరణ్ కెరియర్ లో వేరే లెవెల్ హిట్ టాక్ అందుకుంటుంది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.  కొంతమంది బుచ్చిబాబును పొగిడేస్తుంటే మరి కొంతమంది మాత్రం బుచ్చిబాబు పై నెగిటివ్ గా ట్రోల్ చేస్తున్నారు . సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఈ వీడియో బాగా ట్రెండ్ అవుతుంది. ఇప్పటికే సినిమాకి సంబంధించిన కొన్ని సన్నివేశాలు లీకై వైరల్ గా మారాయి.  కాగా  వచ్చే ఏడాది మార్చి 27 వ తేదీన ప్రేక్షకులు ముందుకు ఈ సినిమా రాబోతుంది..!



మరింత సమాచారం తెలుసుకోండి: