మనందరికీ తెలిసిందే ..సినిమా ఇండస్ట్రీలో ఒక బిగ్  స్టార్ హీరోతో సినిమా ఛాన్స్ అందుకోవడం అంటే మామూలు మ్యాటర్ కాదు.  ఆ డైరెక్టర్ ఎన్నో సంవత్సరాలు వెయిట్ చేయాలి.  కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోతున్నాయి.  ఒక్క బిగ్ పాన్ ఇండియా  హిట్ కొడితే చాలు పాన్ ఇండియా హీరోలు అందరూ కూడా ఆ డైరెక్టర్ తో సినిమా అవకాశం కోసం వెయిట్ చేసేస్తున్నారు . రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ తో ఎంతమంది స్టార్ హీరోలు సినిమాలలో నటించాలి అంటూ వెయిట్ చేస్తున్నారు అనే విషయం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు . కాగా టాలీవుడ్ ఇండస్ట్రీ అనగానే అందరికీ మొదటగా గుర్తుచేది చిరంజీవి . మెగాస్టార్ గా ట్యాగ్ చేయించుకుని తన పేరుపై ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి .. తన పేరు చెప్పుకొని నలుగురు ఇండస్ట్రీలోకి వచ్చేస్ధాయికి ఎదిగాడు మెగాస్టార్ చిరంజీవి .


అయితే మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసాక బిగ్ హిట్ అంటూ ఏది అందుకోలేదు . ఏదో మెగా ఫ్యాన్స్ ఆయన నటించిన సినిమాలను హిట్ చేశారే తప్పిస్తే ఎక్కడా కూడా ఇది మా మెగాస్టార్ సినిమా అంటూ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే మూవీ ఒక్కటంటే ఒక్కటి లేదు.  అయితే ఆ కోరిక తీర్చబోతున్నాడు మెగాస్టార్ చిరంజీవి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కే  సినిమాతో ఆ కోరిక తీరబోతుంది మెగా ఫాన్స్ కి అని చెప్పడంలో సందేహం లేదు . అయితే మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్యకాలంలో కమిట్ అవుతున్న డైరెక్టర్స్ చూసి జనాలకి ఓ విషయం పక్కాగా అర్థం అయిపోతుంది.



చిరంజీవి స్టార్ స్టేటస్ ఉంటేనే తన సినిమాలకి డైరెక్షన్ చేసే అవకాశం ఇవ్వరు అని ఖచ్చితంగా రెండే రెండు పాయింట్స్ ఎక్కువగా గమనిస్తున్నారు అని ..ఆ డైరెక్టర్ కి సినిమా చేయాలి అన్న ఇంట్రెస్ట్ ఉండాలి. ఏదో తూతూ మంత్రంగా సినిమా తీస్తే  ఒప్పుకోడు . అదేవిధంగా ఆ డైరెక్టర్ కచ్చితంగా ముందు రెండు సినిమాలు హిట్ అయి ఉండాలి . అలా ఉంటేనే చిరంజీవి సినిమా చేయడానికి అవకాశం ఇస్తున్నాడు అన్న విషయంపై మెగా ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు . విశ్వంభర సినిమాకి డైరెక్టర్ గా ఛాన్స్ వశిష్టకు ఇచ్చాడు . ఆయన ట్రాక్ రికార్డు అందరికీ తెలిసిందే . ప్రజెంట్ ఇప్పుడు అనిల్ తో  సినిమా చేస్తున్నాడు . అనిల్ రావిపూడి ట్రాక్ రికార్డు వేరే లెవెల్ లో ఉంది.  అనిల్ రావిపూడి సినిమా కోసం ఎంత కష్టపడతారు అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . కష్టపడే తత్వం ..కచ్చితంగా అంతకుముందు రెండు సినిమాలు హిట్ అయి ఉంటే మాత్రం మెగాస్టార్ సినిమా ని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసేయొచ్చు..!

మరింత సమాచారం తెలుసుకోండి: