
అయితే ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబుతో ప్రత్యేకమైన భేటీ అయినట్లుగా ఒక ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. అంతేకాకుండా ఒక ఆర్ట్ వర్క్ ని కూడా బహుమతిగా ఇచ్చింది పూనమ్. రాజధాని అమరావతిని అభివృద్ధి చేయాలి అన్నట్టుగా ఈ ఆర్ట్ వరకు ఉండడం గమనార్హం. ఈ ఆర్ట్ చూసిన అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. గతంలో అప్పుడెప్పుడో కనిపించిన పూనమ్ ఇప్పుడు కాస్త బొద్దుగా మారిపోయి సడన్ ట్విస్ట్ ఇచ్చిందని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. అంతేకాకుండా ఏదో అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లుగా తెలియజేసింది.
కానీ తనకు ఫుడ్ అలర్జీ ఉందని అలాగే ఫైబ్రోమాయాల్జియా అనేటువంటి వ్యాధితో కూడా తాను ఇబ్బంది పడుతున్నట్లు తెలియజేసింది. తన ఆరోగ్య సమస్యల వల్లే తన శరీరం కూడా కాస్త లావుగా ఉన్న ఒకానొక సందర్భంలో తెలియజేసింది. ఇప్పుడు ఫోటోలను చూస్తే ఆవ్యాధి కారణం అన్నట్లుగా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి పూనమ్ కౌర్ సడన్ గా ట్విట్టర్లు షేర్ చేసిన ఈ ఫోటోలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. పూనమ్ కౌర్ సినిమాల విషయానికి వస్తే 2022లో చివరిగా నాతి చేరామి అనే సినిమాల నటించింది ఆ తర్వాత మరే సినిమాలో కూడా నటించలేదు.