తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన హీరోలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. ఈయన చాలా కాలం క్రితం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే సినిమాను మొదలు పెట్టిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని మొదలు పెట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ స్టార్ట్ చేసిన భీమ్లా నాయక్ , బ్రో సినిమాలు ఇప్పటికే విడుదల అయ్యి కూడా చాలా కాలం అవుతుంది. కానీ ఈ సినిమా షూటింగ్ మాత్రం చాలా సార్లు ఆగిపోతూ , స్టార్ట్ అవుతూ రావడంతో కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ షూటింగ్ మొత్తం పూర్తి అయింది. ఈ సినిమాను జూన్ 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకు సంబంధించిన అన్ని ఏరియాల థియేటర్ హక్కులను ఈ మూవీ బృందం అమ్మి వేస్తూ వస్తున్నట్లు తెలుస్తోంది.

సినిమా యొక్క యూ ఎస్ ఏ హక్కులను ఇప్పటికే ఈ మూవీ యూనిట్ అమ్మివేసింది. ఈ సినిమా యొక్క యూ ఎస్ ఏ హక్కులను ప్రత్యాంగిర సినిమాస్ సంస్థ దక్కించుకుంది. ఈ విషయాన్ని ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను కూడా విడుదల చేసింది. ఇకపోతే ఈ సినిమా యొక్క యూ ఎస్ ఏ హక్కులను దక్కించుకున్న ప్రత్యంగిర సినిమాస్ సంస్థ ఈ మూవీ ని యూ ఎస్ ఏ లో అత్యంత భారీ ఎత్తున విడుదల చేయడం కోసం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ మూవీ జూన్ 12 వ తేదీన విడుదల కానుండగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షో లను యు ఎస్ ఏ లో జూన్ 11వ తేదీన ప్రదర్శించనున్నట్లు కూడా ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: