
టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమాలో తన స్టయిల్ గురించి పలు కీలక వ్యాఖ్యలు చేశాడు .. తాజా ఓ ఇంటర్వ్యూలో సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ తన స్టయిల్ వేరే ఎవరికీ రాదని .. అలాగే తనను కాపీ కొట్టి నటించడం ఎవరి తరం కాదని కూడా ఆయన అంటున్నాడు .. ప్రస్తుతం ఇండస్ట్రీలో జరుగుతున్న బాడీ డబల్ కు సంబంధించి ఈ హీరో కామెంట్స్ చేశాడు . ఈమధ్య ఎక్కువగా బాడీ డబుల్ వాడుతున్నారని విమర్శలు భారీగా ఎదుర్కొంటున్నాడు బెల్లంకొండ .. అయితే ఇప్పుడు దీని పై స్పందించిన ఈ యంగ్ హీరో , బాడీ డబుల్ వాడకంలో తప్పులేదని అయితే తనకు మాత్రం బాడీ డబుల్ చేయటం కష్టమని అంటున్నాడు .. ప్రధానం గా తన సినిమాల్లో స్టంట్సు నేనే చేస్తాను బాడీ డబల్ తో కొన్ని చేయడంలో తప్పులేదు .. కానీ నేను మాత్రం సొంతం గానే చేస్తాను .. ఎందుకంటే నా స్టైల్ ఎవరికీ రాదు ఎవరు నన్ను మ్యాచ్ చేయలేరు .
ఇదే క్రమంలో తనపై వస్తున్నా మరో వివాదం పై కూడా ఈ హీరో క్లారిటీ ఇచ్చాడు .. ప్రధానంగా బెల్లంకొండ నిర్మాతలను ఎక్కువగా ఇబ్బంది పెడతారని విమర్శలు మొదటి నుంచి ఉన్నాయి . అయితే ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో వాటిని గట్టిగానే తిప్పుకొట్టాడు .. ప్రధానంగా తన సినిమాల విషయంలో తాను ఎప్పుడూ నిర్మాతన్ని ఇబ్బంది పెట్టనని తన సినిమాకు ఎంత అవసరమో అంత బడ్జెట్ మాత్రమే పెట్టమని అడుగుతానని కూడా అంటున్నాడు .. అలాగే ఓ నిర్మాత కొడుకుగా ప్రొడ్యూసర్ కష్టాలంటో తనకు తెలుసని , అందుకే షూటింగ్ కు టైం కు వెళ్తానని షూట్ పూర్తి చేసి ఇంటికి వెళ్తానని కూడా బెల్లంకొండ చెబుతున్నాడు .. తాజాగా ఈ హీరో నటిస్తున్న భైరవం మూవీ ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది .. ఈ సినిమాతో ఈ యంగ్ హీరో ఎలాంటి సక్సెస్ చేస్తాడో చూడాలి .