కోలీవుడ్ స్టార్ యాక్టర్ విశాల్ ఫైనల్ గా ఓ ఇంటివాడు అయ్యేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. తమిళ ప్రముఖ నటి సాయి ధన్షిక తో విశాల్ ఏడడుగులు వేయబోతున్నాడు. దాదాపు 15 ఏళ్ల నుంచి వీరిద్ద‌రి మధ్య పరిచయం ఉంది. అయితే కొన్నాళ్ల క్రితం ఆ పరిచయం ప్రేమగా మారింది. ఇప్పుడు పెళ్లి వరకు వెళ్ల‌బోతుంది. సాయి ధన్షిక‌ ప్రధాన పాత్రలో తెర‌కెక్కిన `యోగి దా` చిత్ర ఆడియో రిలీజ్ వేడుక చెన్నైలో సోమవారం రాత్రి జరిగింది. ఈ ఈవెంట్ కు గెస్ట్ గా హాజరైన విశాల్.. తన పెళ్లి ప్రకటన చేశాడు.


సాయి ధన్షిక, విశాల్ తాము రిలేషన్ లో ఉన్నట్లు కన్ఫామ్ చేయడమే కాకుండా.. ఆగస్టు 29న వివాహం చేసుకోబోతున్నట్లు అధికారికంగా అనౌన్స్ చేశారు. ఈ ప్రకటన వారి అభిమానుల్లో ఆనందాన్ని నింపింది. ఇక మరోవైపు సోషల్ మీడియాలో విశాల్, సాయి ధన్షిక మధ్య ఏజ్ గ్యాప్ పై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. త్వరలో మూడుముళ్ల బంధంలోకి అడుగు పెట్టబోతున్న ఈ జంట మధ్య ఉన్న వయసు వ్యత్యాసం తెలిస్తే ఓరి దేవుడా! అనకుండా ఉండలేరు.


ఎందుకంటే.. వ‌య‌సులో విశాల్ క‌న్నా ధ‌న్షిక చాలా చిన్న‌ది. విశాల్ వయసు 47. ఆల్మోస్ట్ ఐదు పదుల వయసుకు ఈయ‌న చేరువ అయ్యారు. ఇక ధ‌న్షిక విషయానికి వస్తే.. ఈమె వయసు 35. అంటే ఇద్దరి మధ్య దాదాపు 12 ఏళ్లు గ్యాప్ ఉంది. ఈ విషయం తెలిసి నిటిజన్లు నూరెళ్ల‌బెడుతున్నారు. విశాల్ మ‌రీ అంత చిన్న పిల్ల‌ను పెళ్లి చేసుకుంటున్నాడా అంటూ అభిప్రాయ‌ప‌డుతున్నారు.  అయితే ప్రేమకు వయసుతో సంబంధం లేదని ఎందరో జంటలు నిరూపించారు. వారిలో ఇప్పుడు విశాల్-సాయి ధ‌న్షిక కూడా చేర‌బోతున్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు


మరింత సమాచారం తెలుసుకోండి: