- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో ఎప్పుడూ అడిగే ప్రశ్న ఒకటే రాజా సాబ్ టీజర్ ఎప్పుడు ..? అయితే ఇది ఎవరికి అందని అంతు చిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది .. ఎందుకంటే ఈ మూవీ టీం నుంచి ఎలాంటి అప్డేట్ రావటం లేదు కనుక .. ఈ సినిమా కు సంబంధించిన టీజర్ అయితే రెడీ అయింది .. సూపర్ గా వచ్చింది కట్ చూసిన వాళ్ళ మాట .. మరి ఎందుకు ఆలస్యం అంటే .. రెండే రెండు ఆన్సర్లు వ‌స్తున్నాయి .. మొన్నటి వరకు హీరో ప్రభాస్ విదేశాల్లో ఉన్నారు .. టీజర్ కు డబ్బింగ్ చెప్పాలి అనే పాయింట్ వినిపించింది .. ఇప్పుడు ఆయన వచ్చేసారు టీజర్ డబ్బింగ్ అనేది పెద్ద విషయం కాదు .. అలానే పని కూడా కాదు .


ఇలాంటి సమయం లో టీజర్ ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియటం లేదు అనేది ఎవరికి తెలియని అంతు చిక్కని సమస్యగా మారింది ..  ఈ సినిమా కి సంబంధించిన టీజర్ ని విడుదల చేస్తే విడుదల ఎప్పుడు అన్నది కూడా అందులో చూపించాల్సి ఉంటుంది .. కనీసం ఫలానా నెలలో విడుదల అన్న పాయింట్ అయిన అందులో పెట్టాలి .. డేట్ సెట్ అవ్వాలి అలా ఉండాలి అంటే ఓటీటీ అమ్మకాలు కూడా జరగాలి .. ఓటీటీ జనాలతో డిస్కషన్ జరగాలి క్లారిటీ రావాలి ... మాట తీసుకోవాలి అది జరిగితే తప్ప రిలీజ్ మీద సరైన క్లారిటీ రాదు .. అది వస్తే తప్ప టీజర్ బయటికి రాదు .. అయితే ఈ నెల చివరకు టీజర్ వస్తుందన్న ఆశ అయితే అభిమానుల్లో ఉంది..  అది ఎంతవరకు నెరవేరుతుంది అనేది కాలమే సమాధానం చెప్పాలి ..

మరింత సమాచారం తెలుసుకోండి: