జయం రవి ఆర్తి ల విడాకుల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వేళ తాజాగా జయం రవి తన ఎక్స్ ఖాతాలో ఫోన్ పట్టుకొని మాట్లాడుతూ గుడ్ న్యూస్ కమింగ్ సూన్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. అయితే ఈ క్యాప్షన్ పట్ల చాలామంది జనాలు చాలా రకాలుగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా కొంతమంది ఆడవాళ్ళు అయితే జయం రవిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. నీది ఒక బతుకేనా అన్నట్లుగా జయం రవి పై నిప్పులు చెరుగుతున్నారు. మరి జయం రవి ఆ పోస్టు ఎందుకు చేశారు అనేది ఇప్పుడు చూద్దాం.. ఆర్తి తాజాగా తనకి నెలకు 40 లక్షల భరణం కావాలి అని పిటిషన్ దాఖలు చేసిన సంగతి మనకు తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే తాజాగా తన ఎక్స్ ఖాతాలో జయం రవి గుడ్ న్యూస్ కమింగ్ సూన్ అంటూ ఫోన్ పట్టుకొని మాట్లాడుతూ క్యాప్షన్ ఇవ్వడంతో త్వరలోనే విడాకులు రాబోతున్నాయి అని జయం రవి సంబరపడిపోతున్నారు కావచ్చు.. అందుకే త్వరలోనే గుడ్ న్యూస్ రాబోతుంది అని క్యాప్షన్ పెట్టారు అంటూ మాట్లాడుకుంటున్నారు. అయితే జయం రవి పెట్టిన పోస్ట్ కి చాలా మంది ఆడవాళ్లు ఆయనపై నిప్పులు చెరుగుతున్నారు.నువ్వు ఒక మనిషివేనా.. పెద్ద సైకోవి..

అసలు నీలాగే నీ భార్య కూడా వేరేవాడితో కులికితే తట్టుకోగలవా.. చూడు నీవు చేసింది నీకు కచ్చితంగా తిరిగి వస్తుంది.. కర్మ రిటర్న్స్.. ఛీ ఛీ నీలాంటి వాడి కోసం ఆర్తి సూసైడ్ కూడా చేసుకోవాలి అనుకుంది అంటూ ఇలా చాలామంది చాలా రకాలుగా జయం రవి పై మండిపడుతున్నారు.. ఏది ఏమైనప్పటికీ జయం రవి తాజాగా ఎంతో హ్యాపీగా ఉన్నట్టు పోస్ట్ చేయడం మాత్రం చాలా మందికి నచ్చడం లేదు.. ఇక జయం రవి ఆర్తి లకు విడాకులు రావడంతోనే ఆయన కెనీషాని అఫీషియల్ గా మ్యారేజ్ చేసుకుంటారని తెలుస్తోంది

మరింత సమాచారం తెలుసుకోండి: