
పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు ఇది అందరికీ తెలిసిందే .. నాలుగేళ్ల నుంచి షూటింగ్ జరుపుకుంటూ ఉంది కానీ .. అంతకుమించి ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న సినిమా ఇది .. అయితే ఇదే విషయాన్ని స్వయంగా నిర్మాత ఏఎం రత్నం తాజాగా బయటపెట్టారు .. పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడిగా సత్యాగ్రహి అనే సినిమాను మొదలుపెట్టారు ఏఎం రత్నం .. కానీ అనుకోని కారణాల వల్ల ఈ సినిమా మధ్యలో ఆగిపోయింది . ఇక అప్పటి నుంచి ఎఏం రత్నం తో సినిమా చేద్దామని పవన్ అంటున్నారట .. అయితే మధ్యలో వేదాళం రీమేక్ చేయాలనుకున్నారు .. తన కోడుకు జ్యోతి కృష్ణ దర్శకత్వం లోనే ఆ సినిమా అనుకున్నారు కానీ ఎన్నికల వల్ల అది జరగలేదు ..
అయితే ఆ తర్వాత క్రిష్ దర్శకత్వం లో హరిహర వీరమల్లు సినిమాను మొదలు పెట్టారు . అలా పవన్ తో సినిమా కోసం సత్యాగ్రహి నుంచి ఎదురు చూస్తున్నారు ఏఎం రత్నం .. కాబట్టి ఈ సినిమా వయస్సు నాలుగేళ్లు కాదంటున్నారు ఆయన .. అలాగే హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించి ప్రమోషన్ల జోరు కూడా పెంచారు చిత్ర యూనిట్ .. ఈ సినిమా నుంచి వరుస పాటలు రిలీజ్ చేస్తూ సినిమా పై అంచనాలు పెంచుతున్నారు .. రీసెంట్ గా ఈ సినిమా నుంచి ఓ సాంగ్ కూడా రిలీజ్ చేశారు ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశం నేపథ్యంలో ఈ సాంగ్ ఉంటుంది .. అయితే ఆ సాంగ్ లో ఫైట్ మొత్తాన్ని పవన్ కళ్యాణ్ స్వయంగా కంపోజ్ చేశారట ఆ ఒక్క ఎపిసోడ్ కోసమే దాదాపు 50 నుంచి 60 రోజులు కష్టపడ్డారట .. జూన్ 12న హరిహర వీరమల్లు థియేటర్లో దండయాత్రకు రెడీ అవుతున్నాడు .. ఈసారి పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విధ్వంసం సృష్టిస్తాడో చూడాలి ..