
ఇప్పుడు సీజన్ 2 జూన్ 13న నుంచి స్ట్రీమింగ్ కానుందని నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా విడుదలైన టీజర్ యాక్షన్, భావోద్వేగాల మేళవింపుతో ఆకట్టుకుంటోంది. ఈ సీజన్‌లో రానా తన కుటుంబాన్ని కాపాడేందుకు మరోసారి మాఫియా ప్రపంచంలోకి అడుగుపెడతాడు. కానీ ఆ ప్రయత్నం అతడి జీవితాన్ని మళ్ళీ కల్లోలంగా మార్చేస్తుందనే మలుపు కథలో కీలకంగా మారనుంది. ఈ సీజన్‌లో రానా, వెంకటేష్‌తో పాటు అర్జున్ రాంపాల్ విలన్ పాత్రలో కనిపించనుండగా, సుర్వీన్ చావ్లా, కృతి ఖర్బందా, సుశాంత్ సింగ్, అభిషేక్ బెనర్జీ, ఆశిష్ విద్యార్థి వంటి నటులు ప్రధాన పాత్రల్లో మెరవనున్నారు. కొత్త పాత్రలు, కొత్త కన్‌ఫ్లిక్ట్‌లు ఈ సీజన్‌ను మరింత ఇంటెన్స్‌గా చేయనున్నట్లు టీజర్‌లో స్పష్టమవుతోంది.
‘రానా నాయుడు’ సీజన్ 2కి కరణ్ అషుమాన్, మరియు సుపర్ణ్ వర్మ దర్శకత్వం వహించగా, సుందర్ అరోన్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించారు. టెక్నికల్ టిమ్, స్టంట్స్, విజువల్స్ అన్ని కలిపి, ఈ సీజన్ 1 కన్నా ఎక్కువ థ్రిల్, డ్రామా, యాక్షన్ ఉండబోతుందని భావిస్తున్నారు. ఇదివరకే ఈ సీజన్ సంబంధించిన విషయాలకు సంబంధించి హీరో విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ వైలెంట్ సన్నివేశాలు కాస్త తగ్గించినట్లు చెప్పుకొచ్చారు. మరి అలాంటి సన్నివేశాలు తగ్గిస్తే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సీజన్ ను చూడడానికి వీలవుతుంది. ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘రానా నాయుడు 2’.. రానా - వెంకీ కాంబినేషన్ మరోసారి తెరపై ఏ మాయ చేస్తుందో చూడాల్సిందే.