పాన్ ఇండియా హీరో ప్రభాస్ తన స్టైల్ మార్చారా .. ఒక్కసారి రెండు మూడు సినిమాలు చేస్తూ వార్తలో  హల్‌చల్‌ చేస్తూ ఉండే  ప్రభాస్ నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయం లో మాత్రం ఆ పద్ధతిని పక్కన పెట్టేయాలని అనుకుంటున్నారా .. ప్రభాస్ లైనప్ లోకి ఒక సినిమా చేస్తా అని కూర్చుంటే అది సాధ్యమయ్యే పనేనా .. అయితే ఈ విషయం లో ప్రభాస్ ప్లానింగ్ ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం .. పాన్ ఇండియా హీరో ప్రభాస్ లైన్ అప్ ఎప్పుడు అయిదారు సినిమాలు కనిపిస్తూ ఉంటాయి . కనీసం రెండు సినిమాలైనా షూటింగ్లో ఉంటాయి . కానీ తన అప్‌ కమింగ్ సినిమాల విషయం లో మాత్రం తన స్టైల్ పక్కన పెట్టేయాల ని ఈ హీరో ఫిక్స్ అయ్యాడు ..


పూర్తిగా ఒక్క సినిమా మీదే తన దృష్టి పెట్టేలా ప్లాన్ చేసుకుంటున్నాడు . ప్రజెంట్ ది రాజా సబ్ , పౌజి సినిమాల షూటింగ్లో బిజీగా ఉన్నాడు ప్రభాస్ .. ఇక తర్వాత సెప్టెంబర్ నుంచి స్పిరిట్ మూవీ షూటింగ్ మొదలు కాబోతోంది . అయితే ప్రభాస్ తాజా డెసిషన్ తో స్పిరిట్ షూటింగ్ మరో నాలుగు నెలలు ఆలస్యం కాబోతున్నంటు  టాక్ వినిపిస్తుంది .. సెట్స్ మీదున్న రెండు సినిమాలు పూర్తయిన తర్వాతే స్పిరిట్ ను మొదలు పెట్టాలని ప్రభాస్ డిసైర్ అయ్యాడట . అలాగే స్పిరిట్‌లో ప్రభాస్ ను ఎంతో డిఫరెంట్గా చూపించాలనుకుంటున్న సందీప్ కు బల్క్‌ డేట్స్ కావాలంటున్నారు. అందుకే ప్రజెంట్ ఉన్న కమిట్మెంట్స్ అన్నీ పూర్తిచేసుకుని ఫుల్ టైం స్పిరిట్‌కే కేటాయించేలా ప్లాన్ చేసుకుంటున్నాడు ప్రభాస్ .. ఇక మరి ఈ ప్లానింగ్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందనేది చూడాలి .



వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9705876414 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: