
అనుకున్న షెడ్యూల్ ప్రకారమే సినిమా ను పూర్తి చేసే పనిలో ఉన్నాము .. షూటింగ్ బాగా జరుగుతుంది అక్టోబర్ 2న కాంతారావు చాప్టర్ వన్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది . విడుదల విషయం లో మమ్మల్ని నమ్మండి .. వేచి ఉండటం ఎంత వీలవుతుందో మీకు అర్థమవుతుంది .. కాంతారా సినిమా పై వస్తున్న తప్పుడు వార్తలను నమ్మకండి .. ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని చేయొద్దని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నామని చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది .. ఇక కాంతారా చాప్టర్ వన్ వాయిదా అంటూ వార్తలు రావడం ఇదే మొదటిసారి కాదు .. గతంలో కూడా ఈ సినిమా వాయిదా అంటూ వార్తలు వచ్చాయి ..
అయితే గతంలో వచ్చింది కాంతారా రెండో భాగం .. ఇప్పుడు షూటింగ్ జరుపుకుంటుంది మొదటి భాగం అన్న విషయం తెలిసిందే .. ఇక కాంతార కథ ఎక్కడి నుంచి మొదలైంది దానికి ముందు జరిగిన సంఘటనను కాంతారా చాప్టర్ 1 లో చూపించనున్నారు .. పంజుర్లి కి సంబంధించిన సన్నివేశాలు చాప్టర్ వన్ లో ఎక్కువగా ఉండబోతున్నాయి .. ఇప్పటికే రిలీజ్ అయిన కొన్ని పోస్టర్స్ అందర్నీ ఎంతగానో ఆకట్టుకున్నాయి .. అలాగే చాప్టర్ వన్ పై భారీ అంచనాలను పెంచేసాయి .. పాన్ ఇండియా లెవెల్ లో చాప్టర్ వన్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు .. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో అన్ని భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయనున్నారు .