కోలీవుడ్ స్టార్ యాక్టర్ జయం రవి, ఆయన సతీమణి ఆర్తీల విడాకుల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఓవైపు చెన్నైలోనే ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టులో విచారణ జరుగుతుండగా.. మరోవైపు జయం రవి, ఆర్తీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటూ వార్తల్లో ట్రెండ్ అవుతున్నారు. గాయని కెనీషాతో జయం రవికి రిలేష‌న్‌లో ఉండ‌టం వ‌ల్లే భార్య‌కు విడాకులు ఇచ్చేందుకు రెడీ అయ్యాడ‌ని కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.


జయం రవితో తనకు విభేదాలు తలెత్తడానికి మూడో వ్యక్తి కారణమంటూ నెట్టింట జ‌రుగుతున్న ప్ర‌చారానికి ఆర్తీ మ‌రింత బ‌లాన్ని చేకూర్చింది. అలాగే తనను ఓ కరెన్సీ మిషన్ గానే అత్తగారి తరఫు వాళ్లు చూశార‌ని.. పిల్లలను ర‌వి ఎన్న‌డూ ప‌ట్టించుకునేవాడు కాద‌ని.. తనను రకరకాలుగా వేధించే వాడంటూ ఆర్తీ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. పైగా విడాకులు కోరుతున్న జయం రవి నుంచి నెలకు రూ. 40 లక్షల భరణం ఇప్పించాలంటూ పిటిషన్ దాఖలు చేసింది.



మ‌రోవైపు జ‌యం ర‌వి సైతం భార్య చేసిన ఆరోప‌ణ‌లపై రియాక్ట్ అవుతూ సోష‌ల్ మీడియాలో ఇటీవ‌ల మూడు పేజీల లేఖ రాసి త‌న గోడును అంద‌రితో పంచుకున్నారు. `ఆర్తీ నాపై చేసే ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదు. నాకు నా పిల్లలంటే ప్రాణం. నా జీవితంలో నా ఇద్ద‌రు కొడుకులే అత్యంత ముఖ్య‌మైన‌ వారు. వారి సంరక్షణ నా బాధ్య‌త‌. ద‌య‌చేసి తప్పుడు ఆరోపణలు ఆపేసేయ్. పిల్లల సంరక్షణ, విడాకుల వ్యవహారం కోర్టు పరిధిలోనే ఉంది. కోర్టు తెల్చే వరకు అసత్య ప్రచారం చేయకు` అంటూ భార్య‌కు జ‌యం ర‌వి వార్నింగ్ ఇచ్చారు.



ఇలాంటి త‌రుణంలో జ‌యం ర‌వి-ఆర్తీల‌ విడాకుల్లో మ‌రో ట్విస్ట్ చోటుచేసుకుంది. అధికారికంగా విడాకుల వ్యవహారం ఓ కొలిక్కి రాకముందే జ‌యం ర‌వి, ఆర్తీలు ఒకరిపై మ‌రొక‌రు ఆరోప‌ణ‌లు చేసుకుంటూ హ‌ద్దులు దాటేస్తుండ‌టంతో.. తాజాగా చెన్నై కోర్టు క‌ల‌గ‌జేసుకుంది. బుద్ధుందా అంటూ ఇద్ద‌రికీ చివాట్లు పెట్టింది. కోర్టులో విడాకుల వ్యవహారం పెండింగ్ లో ఉండగానే మీ అభిప్రాయాలు మీడియా ముందు ఎలా బ‌య‌ట‌పెడతారంటూ మందలించింది. ఇక‌పై బహిరంగంగా ఆరోపణలు చేసుకోవ‌డం, మీడియాకు ప్రెస్ నోట్స్ విడుదల చేయ‌డం వంటివి చేయ‌కూడ‌ద‌ని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ జూన్ 12న వాయిదా వేసింది. మ‌రి ఇప్ప‌టికైనా జ‌యం ర‌వి, ఆర్తీలు సైలెంట్ అవుతారా? లేదా? అన్న‌ది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: