కొందరు తారలు చేసేది తక్కువ సినిమాలే అయినా ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ గుర్తుండిపోయే ముద్రను వేస్తుంటారు. అలా ఒక్క సినిమాతో స్ట్రాంగ్ ఇంపాక్ట్ ను క్రియేట్ చేసింది సుకృతి అంబటి. 2015లో విడుదలైన `కేరింత` అప్పటి యూత్ ను విశేషంగా ఆకట్టుకున్న చిత్రం. కాలేజీలో చదువుకునే ముగ్గురు యువ జంటల చుట్టూ ఈ మూవీ స్టోరీ సాగుతుంది. కేరింతలో వన్ ఆఫ్ ది హీరోయిన్ గా యాక్ట్‌ చేసింది సుకృతి.
 

అదేనండి నూకరాజు పాత్రని పార్వతీశం పోషించగా.. అత‌నికి జోడిగా భావన పాత్రలో సుకృతి అల‌రించింది. తొలి సినిమాతోనే మంచి గుర్తింపును సంపాదించుకుంది. తనదైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. కానీ ఆ తర్వాత పెద్దగా సినిమాల్లో కనిపించలేదు. సుకృతి స్వ‌స్థ‌లం  నెల్లూరు జిల్లా కావలి. అయితే ఉద్యోరీత్యా ఆమె తండ్రి ఢిల్లీలో స్థిర‌ప‌డ్డారు. స‌కృతి పుట్టి పెరిగింది కూడా ఢిల్లీలోనే.
కేరింత మూవీ త‌ర్వాత అవ‌కాశాలు రాక‌పోవ‌డం వల్లో లేక న‌చ్చిన పాత్ర‌లు దొర‌క్క‌పోవ‌డం వ‌ల్లో తెలియ‌దు గానీ.. సుకృతి వెండితెర‌పై క‌నిపించ‌లేదు. అయితే సోష‌ల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటోంది. సొంతంగా యూట్యూబ్ ఛానెల్‌ను రన్ చేస్తోంది. అన్న‌ట్లు సుకృతికి వివాహం కూడా జ‌రిగింది. మ్యారేజ్ అనంత‌రం కొంత కాలం అమెరికాలో నివాసం ఉన్న స‌కృతి.. ప్ర‌స్తుతం ఇండియాలోనే భ‌ర్త‌తో లైఫ్ లీడ్ చేస్తోంది.
ఇక సుకృతి ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోయారు. కొంచెం బొద్దుగా మారిన కూడా హీరోయిన్ల‌కు ఏమాత్రం తీసిపోని గ్లామ‌ర్ తో సుకృతి ఆక‌ట్టుకుంటోంది. ఆమె తాజా ఫోటోలో సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతుండ‌టంతో.. మ‌న భావ‌న‌ ఏముందిరా బాబు అంటూ నెటిజ‌న్లు చ‌ర్చించుకున్నారు.

వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు


మరింత సమాచారం తెలుసుకోండి: