ఏంటి డివోర్స్ తీసుకున్న హీరోయిన్ తో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రేమాయణం నడిపిస్తున్నారా.. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు..బెల్లంకొండ శ్రీనివాస్ కి ఆ హీరోయిన్ లో ఏం నచ్చింది అనేది ఇప్పుడు చూద్దాం. బెల్లంకొండ సురేష్ బాబు నిర్మాతగా ఎన్నో సినిమాలు తీసి హిట్టు కొట్టారు. అలా స్టార్ నిర్మాతల్లో ఒకరిగా ఉన్న ఈయన ప్రస్తుతం తన కొడుకుని ఇండస్ట్రీకి పరిచయం చేసి ఇండస్ట్రీలో స్టార్ ని చేయాలి అనుకుంటున్నారు. అయితే ఈయన పలుకుబడి ఉపయోగించి ఎంత పెద్ద హీరోయిన్లని సినిమాల్లో నటింపజేసి స్టార్ దర్శకులతో తన కొడుకుకి సినిమాలు చేసి పెట్టినా కూడా ఒక్క సినిమా కూడా హిట్ అవ్వడం లేదు.అలా అల్లుడు శీను, జయ జానకి నాయక, సీత,రాక్షసుడు వంటి ఎన్నో సినిమాల్లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చేసనా కూడా ఇందులో హీరోయిన్లు ఫేమస్ అవుతున్నారు తప్ప బెల్లంకొండ శ్రీనివాస్ కి ఏమాత్రం పేరు రావడం లేదు.

దాంతో తాజాగా భైరవం సినిమాతో ఇద్దరు హీరోలతో కలిసి నటిస్తున్నారు. అలా మనోజ్, రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ముగ్గురు భైరవం మూవీలో చేస్తున్నారు.ఈ సినిమా మరో మూడు రోజుల్లో థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్ ఈవెంట్లో ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు ఈ హీరో.అయితే ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన హీరోయిన్ గా స్టార్ దర్శకుడు శంకర్ కుమార్తె అయినటువంటి అతిథి శంకర్ నటిస్తోంది  అయితే ఈ సినిమాలో అధితి శంకర్ కాకుండా మీ పక్కన వేరే హీరోయిన్ ఎవరైతే బాగుంటారు అని యాంకర్ ఈ సినిమా ఈవెంట్లో ప్రశ్నించగా . నాకు సమంత అంటే చాలా ఇష్టం. ఈ సినిమాలో అదితి శంకర్ కి బదులుగా సమంత ఉంటే బాగుంటుంది అంటూ ఆన్సర్ ఇచ్చారు.

అయితే సమంత ని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అంతలా ఇష్టపడడానికి కారణం ఆయన మొదటి సినిమా హీరోయిన్ కాబట్టి. అల్లుడు శీను సినిమాలో సమంత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కలిసి నటించారు. ఈ సినిమాతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇండస్ట్రీకి పరిచయమైనప్పటికీ ఈ సినిమా ద్వారా ఈయనకు ఏమాత్రం గుర్తింపు అయితే రాలేదు.ఇక ఇందులో స్టార్ హీరోయిన్ సమంతని తీసుకుంటే సినిమాకి మరింత క్రేజ్ పెరుగుతుందని సురేష్ బాబు అనుకున్నప్పటికీ సమంతకి తప్ప బెల్లంకొండ శ్రీనివాస్ కి పేరైతే రాలేదు. అయితే తాజాగా బైరవం మూవీ ప్రమోషనల్ ఈవెంట్లో తనకి సమంత అంటే ఇష్టం అని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చెప్పాడంతో చాలామంది నెటిజన్లు డివోర్స్ తీసుకున్న హీరోయిన్ ని ఇష్టపడుతున్న బెల్లంకొండ శ్రీనివాస్ అంటూ సోషల్ మీడియాలో ఈ వీడియోని వైరల్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: