టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విజయాలు సాధించడం సులువు కాదు. లక్ కలిసొచ్చి ఒకటి రెండు సినిమాలు హిట్టైనా ఆ మ్యాజిక్ ను రిపీట్ చేసే విషయంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అయితే తేజ సజ్జా మాత్రం తను హీరోగా తెరకెక్కిన ప్రతి సినిమాతో మ్యాజిక్ చేస్తున్నారు. జాంబిరెడ్డి, హనుమాన్ సినిమాలతో విజయాలను అందుకున్న తేజ సజ్జా మిరాయ్ సినిమాతో మరోసారి మ్యాజిక్ చేయడం పక్కా అని తెలుస్తోంది.
 
ఈగల్ సినిమాతో యావరేజ్ రిజల్ట్ ను సొంతం చేసుకున్న కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మంచు మనోజ్ ఈ సినిమాలో నెగిటివ్ షెడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారు. తేజ సజ్జా ఈ సినిమాతో భారీ హిట్ అందుకుంటానని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి ఈ సినిమా భారీ విజయాన్ని అందిస్తుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
 
షాట్స్ కొంతమేర కల్కి సినిమాను గుర్తు చేస్తున్నా తేజ సజ్జా రేంజ్ ను ఈ సినిమా పెంచుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తేజ సజ్జా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. తేజ సజ్జా నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. తేజ సజ్జా రెమ్యునరేషన్ సైతం పరిమితంగా ఉంది.
 
టాలీవుడ్ టాప్ బ్యానర్లలో తేజ సజ్జా నటిస్తుండగా భవిష్యత్తు సినిమాలు సైతం తేజ సజ్జాకు భారీ విజయాలను అందించే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. తేజ సజ్జా కథల ఎంపికలో ఇదే విధంగా కొనసాగితే బాగుంటుంది. కథల ఎంపిక విషయంలో టాలీవుడ్ హీరోలు తేజ సజ్జాను ఫాలో అయితే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. తేజ సజ్జాకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఊహించని స్థాయిలో పెరుగుతోంది. తేజ సజ్జా లుక్స్ విషయంలో ఎంతో కేర్ తీసుకుంటూ ఉండటం గమనార్హం.




మరింత సమాచారం తెలుసుకోండి: