
అయితే ఇళయరాజా మేధస్సు, సంగీత పటిమ ఎంత గొప్పదైనా, కొన్ని సందర్భాల్లో ఆయన వ్యాఖ్యలు, నిర్ణయాలు వివాదాలకు దారితీశాయి. ఇప్పుడు మరోసారి ఆయన వ్యాఖ్యలు విమర్శలకు కారణం అయ్యాయి. ఇళయరాజా `షష్టిపూర్తి` అనే సినిమాకు సంగీతం అందించారు. పవన్‌ప్రభ అనే నూతన దర్శకుడు తెరకెక్కించిన ఈ చిత్రాన్ని మా ఆయి ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపేష్ చౌదరి నిర్మించారు. `లేడీస్ టైలర్` మూవీలో నటించిన రాజేంద్రప్రసాద్, అర్చన తిరిగి 37 సంవత్సరాల తరువాత షష్టిపూర్తి సినిమాలో మెయిన్ లీడ్‌గా యాక్ట్ చేశారు.
మే 30న షష్టిపూర్తి చిత్రం విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ మూవీ నుండి బయటకు వచ్చిన సాంగ్స్ ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి. అయితే ప్రమోషన్స్ లో భాగంగా ఇళయరాజా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. `ఈ లోకంలో నా అంతటి సంగీత దర్శకుడు ఎవరూ లేరు. నా లాంటి వాడు ఇంతకుముందు పుట్టలేదు, ఇకపైన పుట్టబోడు` అంటూ గొప్పగా చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలు విమర్శలకు దారితీశాయి. కొందరు ఇళయరాజా మాటలను సమర్థిస్తున్నా.. కొందరు నెటిజన్లు మాత్రం `మీకంత బలుపు అవసరమా రాజుగారు` అంటూ ఫైర్ అవుతున్నారు. ఇళయరాజా గొప్ప స్వర మేధావినే అయినప్పటికీ.. తనకంటే తోపు ఎవరూ లేరని చెప్పుకోవడం అతిగా ఉందని పలువురు విమర్శిస్తున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు