- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సూపర్ కల్ట్ క్లాసిక్ మూవీ ఖలేజా 15 సంవత్సరాల తర్వాత ఈరోజు థియేటర్లలో రీ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ - తెలంగాణతో పాటు అటు అమెరికాలోనూ ఖలేజా రీ రిలీజ్ హంగామా చూస్తుంటే సినిమా నిజంగా సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నట్టే కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో చిన్న చిన్న పల్లెటూరులో కూడా ఖలేజా తొలి రోజు అన్ని షోలు హౌస్ ఫుల్స్‌ పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని ప్రధాన నగరాలతో పాటు ద్వితీయ శ్రేణి నగరాలు బి సెంటర్లు, సి సెంటర్లలో కూడా ఖలేజా రీ రిలీజ్ అవుతోంది. టాలీవుడ్ ట్రేడ్ వ‌ర్గాల‌ సమాచారం ప్రకారం తొలిరోజు అడ్వాన్స్ బుకింగ్స్ ఏకంగా ఎనిమిది కోట్ల రేంజ్ లో ఉన్నాయని చెబుతున్నారు. దీనిని బ‌ట్టి ఖ‌లేజా బ్లాస్టింగ్‌ ఏ రేంజ్ లో ఉందో తెలుస్తోంది.


15 సంవత్సరాల క్రితం ఈ సినిమా వచ్చినప్పుడు భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అంచనాలు అందుకోలేదు. మహేష్ బాబును ప్రేక్షకులు కామెడీ జాన‌ర్లో చూడటం అప్పట్లో వాళ్లకి నచ్చలేదు. పైగా ఈ సినిమాకి పోటీగా రజనీకాంత్ - శంకర్ కాంబినేషన్లో వచ్చిన రోబో , ఎన్టీఆర్ బృందావనం సినిమాలు కూడా అప్పుడే రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడం తో ఖ‌లేజా సినిమాను ఎవ‌రూ పట్టించుకోలేదు. అయితే తెలుగు ప్రేక్షకులు ఆ తర్వాత ఖ‌లేజా ను ఎందుకు ప్లాప్ చేశామా అని ఎప్పటికీ బాధపడుతూ ఉంటారు. అందుకే ఆ సినిమాను బుల్లి తెర మీద అన్ని సార్లు సూప‌ర్ హిట్ చేశారు.. భారీ టీఆర్పీ రేటింగులు క‌ట్ట బెట్టారు. మరి రీ రిలీజ్ లో ఖ‌లేజా ను కచ్చితంగా సూపర్ డూపర్ హిట్ చేయటం ఖాయంగా కనిపిస్తోంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: