ఈ మధ్యకాలంలో మల్టీస్టారర్ మూవీలను చూడడానికి జనాలు ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో అంతకంటే డబల్ ఇంట్రెస్ట్ తోనే క్రేజీ క్రేజీ కాంబోలు సెట్ చేయడానికి డైరెక్టర్లు వెయిట్  చేస్తున్నారు . ప్రెసెంట్ సినిమా ఇండస్ట్రీలో ఓ న్యూస్ వెరీ వెరీ హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. అయితే ఈ కాంబో పట్ల కొంతమంది పాజిటివ్ గా స్పందిస్తూ ఉంటే మరి కొంతమంది నెగటివ్గా స్పందిస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో నాగార్జున - వెంకటేష్ కాంబోలో మల్టీస్టారర్ మూవీ వస్తే బాగుంటుంది అంటూ జనాలు కోరుకుంటున్నారు . అయితే ఇన్నాళ్ళకి వాళ్ళ కోరిక తీరబోతున్నట్లు తెలుస్తుంది .


అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ నాగార్జున హీరోలుగా మల్టీస్టారర్ మూవీ రాబోతుంది అన్న న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది. రీసెంట్ గానే "సంక్రాంతికి వస్తున్నాం" సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టిన అనిల్ రావిపూడి ప్రజెంట్ మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా చకచకా కంప్లీట్ చేసేస్తున్నాడు ..అన్ని అనుకున్నట్లు కుదిరితే సంక్రాంతి కి ఈ సినిమాను రిలీజ్ చేసేస్తాడు . అయితే ఆ తర్వాత వెంటనే నాగార్జునతో మూవీకి కమిట్ అయ్యాడట . ఆల్రెడీ సీనియర్ హీరోస్ అయిన చిరంజీవి - బాలకృష్ణ - వెంకటేష్ లతో ఆయన మూవీలో చేసేసాడు .



ఇక మిగిలింది నాగార్జున మాత్రమే. ఆయనతో మూవీ చేస్తే ఆల్మోస్ట్ అందరి హీరోలతో వర్క్ చేసేసినట్లే . ఆ కారణంగానే నాగర్జునతో కొత్త ప్రాజెక్టును ఫైనలైజ్ చేసారట.  అంతేకాదు ఈ సినిమాలో వెంకటేష్ కూడా నటించబోతున్నాడట . కానీ ఇది సర్ప్రైజింగ్ క్యారెక్టర్ అన్నట్లు తెలుస్తుంది . అయితే కొంతమంది మాత్రం ఇప్పుడు నాగార్జునతో సినిమా చేయడం పట్ల నెగటివ్ గా స్పందిస్తున్నారు. పోయి పోయి నాగార్జున లాంటి హీరోతో నువ్వు సినిమా అంటున్నావ్ ఏంటి..? ఆయనతో డైరెక్షన్ ఎంత కష్టమో నీకు తెలియదా..? ప్రతిదీ ఆయన తనకు నచ్చినట్లు డైరెక్ట్ చేయాలి అంటూ ఉంటాడు.  నువ్వు రాసుకునే స్క్రిప్ట్ మొత్తం మార్చేస్తాడు ..అంటూ నాగార్జున పై గతంలో వచ్చిన ఘాటు రూమర్స్ ను మరొకసారి ట్రెండ్ చేస్తున్నారు. గతంలో చాలా సార్లు నాగార్జునను డైరెక్ట్ చేయడం చాలా కష్టమని అందుకే పలువురు డైరెక్టర్లు ఆయనతో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపించరు అంటూ వార్తలు వినిపించిన విషయాలు అందరికీ తెలిసిందే.  మరొకసారి అనిల్ రావిపూడి - నాగార్జున కాంబో గురించి అదే విధంగా మాట్లాడుకుంటున్నారు . దీనితో తెలుగు హీరో అయిన నాగార్జున పరువు పోయినట్లయింది. ప్రజెంట్ నాగార్జున కొడుకు అఖిల్ పెళ్లి పనుల్లో బిజీ బిజీగా ఉన్నాడు..!

మరింత సమాచారం తెలుసుకోండి: