సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందిన ఖలేజా సినిమా తాజాగా మే 30 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున రిలీజ్ అయిన విషయం మన అందరికీ తెలిసిందే. రీ రిలీజ్ లో భాగంగా ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభిస్తుంది. ఇకపోతే ఈ సినిమా ఇప్పటివరకు రెండు రోజుల బాక్సా ఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ రెండు రోజుల్లోనే ఈ సినిమా ఇప్పటివరకు రీ రిలీజ్ అయిన సౌత్ మూవీలలో టాప్ 4 ప్లేసులో నిలిచింది. తమిళ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి దళపతి విజయ్ హీరోగా రూపొందిన గిల్లి సినిమా కొన్ని రోజుల క్రితం రీ రిలీజ్ అయింది.

మూవీ రీ రిలీజ్ లో భాగంగా టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి 32.50 కోట్ల కలెక్షన్లతో మొదటి స్థానంలో కొనసాగుతూ ఉండగా ... తలపతి విజయ్ హీరోగా రూపొందిన సచిన్ మూవీ 13.60 కోట్ల కలెక్షన్లతో రెండవ స్థానంలో కొనసాగుతుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందిన మురారి సినిమా రీ రిలీజ్ లో భాగంగా టోటల్ బాక్సా ఫీస్ రామ్ కంప్లీట్ అయ్యే సరికి 8.90 కోట్ల కలెక్షన్లను వసూలు చేయగా , మహేష్ బాబు హీరోగా రూపొందిన ఖలేజా సినిమా కేవలం రెండు రోజుల్లోనే 8.90 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది.

ఇక ఈ మూవీ మరికొన్ని రోజుల పాటు మంచి కలెక్షన్లను వసూలు చేసే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. దానితో ఈ మూవీ ఈజీగా రెండవ స్థానంలోకి ఎగబాకి అవకాశాలు ఉన్నాయి అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. మరి ఖలేజా సినిమా రీ రిలీజ్ లో భాగంగా ఎన్ని కలెక్షన్లను వసూలు చేసి ఏ స్థాయిలో నిలుస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Mb