ఉదయ్ కిరణ్ చావు ఇప్పటికి ఓ మిస్టరీనే. ఈయన సూసైడ్ చేసుకొని చనిపోయినప్పటికీ కొంత మంది కారణంగా ఈయన మరణించారని అంటూ ఉంటారు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ మెగా ఫ్యామిలీ వల్లే ఉదయ్ కిరణ్ డిప్రెషన్ లోకి వెళ్లి సూసైడ్ చేసుకున్నారని అంటూ ఉంటారు.అయితే మొదట ఉదయ్ కిరణ్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మితతో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల వీరిద్దరి పెళ్లి క్యాన్సిల్ అయింది.ఇక పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నప్పటి నుండి ఉదయ్ కిరణ్ మీద మెగా ఫ్యామిలీ పగ పెంచుకొని ఆయనకు వచ్చిన అవకాశాలన్నీ చెడగొట్టారని,ఇండస్ట్రీలో ఉన్న ఏ ఒక్కరు కూడా ఉదయ్ కిరణ్ కి అవకాశం ఇవ్వకూడదు అని వార్నింగ్ ఇవ్వడంతో ఇండస్ట్రీలో బడా ఫ్యామిలీ గా ఉన్న మెగా ఫ్యామిలీకి చాలామంది దర్శకనిర్మాతలు భయపడి ఉదయ్కిరణ్ ని ఎవరు కూడా సినిమాలో తీసుకోవడానికి ముందుకు రాలేదట. 

దాంతో చేసిన సినిమాలు ఫ్లాప్ అయ్యి కొత్త అవకాశాలు లేకపోవడంతో చాలా డిప్రెషన్ లోకి వెళ్లి ఉదయ్ కిరణ్ మరణించారు. అయితే ఉదయ్ కిరణ్ మరణం పై ఇప్పటికే ఎంతోమంది ఆయనతో తిరిగిన సన్నిహితులు చాలా విషయాలు చెప్పారు. ఇందులో భాగంగా నిర్మాత నటుడు అయినటువంటి మురళీమోహన్ మాట్లాడిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో మురళీమోహన్ మాట్లాడుతూ.. మహేష్ బాబు నటించిన అతడు మూవీ మొదట ఉదయ్ కిరణ్ తోనే చేయాలి అనుకున్నాం. ఉదయ్ ఫస్ట్ మూవీ చూసి నేను ఫిదా అయి ఆయనకు ఫోన్ చేసి మరీ విష్ చేశాను.ఆ తర్వాత ఉదయ్ ఇంటికి వచ్చి మరీ నన్ను కలిశారు. అలా అతడు మూవీ అనుకున్నాను.

ఆ తర్వాత చిరంజీవి గారి పెద్దమ్మాయితో ఎంగేజ్మెంట్ అవ్వడం తో మెగా ఫ్యామిలీ ఉదయ్ కిరణ్ డైరీ ని ఇవ్వమని వాళ్లే హ్యాండిల్ చేశారు. అలా అతడు సినిమాని ఆయనతో అనుకున్నప్పటికీ అల్లు అరవింద్ కుదరదని చెప్పి డేట్స్ చేంజ్ చేశారు.అలా అతడు సినిమాకి డేట్స్ అడిగినప్పుడు సారీ సార్ వేరే సినిమాకు డేట్స్ ఇచ్చేశాను మర్చిపోయాను కన్ఫ్యూజన్ లో ఉన్నాను అని చెప్పారు.దాంతో పరవాలేదు అని మేము కూడా పక్కన పెట్టాం..అంటూ ఉదయ్ కిరణ్ గురించి చెప్పుకొచ్చారు. ఇక మురళీమోహన్ మాటలతో మెగా ఫ్యామిలీ ఉదయ్ కిరణ్ ని ఇంటి అల్లుడుగా చేసుకోక ముందే ఎలా పెత్తనం చెలాయించారో అర్థం అవుతుంది అని ఈ వీడియో చూసిన ఉదయ్ కిరణ్ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: