
అనేక వాయిదాల అనంతరం జూన్ 14న హరిహర వీరమల్లు చిత్రాన్ని విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ ఆ తేదీకి కూడా ఈ చిత్రం వచ్చేలా కనిపించడం లేదు. సోషల్ మీడియాలో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్లే రిలీజ్ పోస్ట్ పోన్ అని ప్రచారం జరుగుతుంది. అయితే నిజానికి ఈ సినిమాకు సంబంధించి వీఎఫ్ఎక్స్ వర్క్ ఇంకా కంప్లీట్ కాలేదు. ఈ నేపథ్యంలోనే విడుదలను జూలైకి షిఫ్ట్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు. ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రానప్పటికీ.. ఓవర్సీస్ లో బుకింగ్స్ సడెన్ గా నిలిపివేశారు. దీంతో రిలీజ్ పోస్ట్ పోన్ అవడం ఆల్మోస్ట్ ఖాయమైంది.
ఇకపోతే `హరిహర వీరమల్లు`కు పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ ఎంత అనే ప్రశ్న చాలా మందిలో ఉంది. సాధారణంగా ఒక్కో సినిమాకు రూ. 50 కోట్ల వరకు పవన్ ఛార్జ్ చేస్తున్నాడు. అందులోనూ వీరమల్లు హిస్టారికల్ మూవీ కావడంతో దాదాపు ఆయన రెమ్యునరేషన్ రూ. 75 కోట్లు ఉండొచ్చని బలమైన టాక్ ఉంది. కానీ పవన్ ఒక్క రూపాయి కూడా ఈ సినిమాకు ఛార్జ్ చేయడం లేదట. సినిమా ప్రారంభం కావడానికి ముందు నిర్మాత ఏయం రత్నం పవన్ కళ్యాణ్ కు రూ. 10 కోట్లు ఇచ్చారట. అది కూడా అడ్వాన్‌గా. ఆ తర్వాత నిర్మాత నుంచి ఒక్క రూపాయి కూడా పవన్ కు రాలేదు. పవన్ కూడా బ్యాలెన్స్ అమౌంట్ గురించి అడగలేదు.
అయితే షూటింగ్ ఆలస్యం కావడం వల్ల అనుకున్న బడ్జెట్ కంటే చాలా ఎక్కువ అయింది. దీంతో ఏయం రత్నంపై ప్రెషర్ బాగా పడుతోంది. ఈ నేపథ్యంలోనే అడ్వాన్స్ గా తీసుకున్న రూ. 10 కోట్లు కూడా వెనక్కి ఇచ్చేయడానికి పవన్ సిద్ధమయ్యాడట. రూపాయి కూడా తనకు రెమ్యునరేషన్ వద్దని నిర్మాతతో చెప్పారట. మొత్తానికి నిర్మాత శ్రేయస్సు కోరే రియల్ హీరోనని పవన్ మరోసారి నిరూపించుకున్నాడు. కాగా, సినిమా విడుదల తరువాత ఏమైనా లాభాలు వస్తే అందులో పవన్ కు ఎంతో కొంత వాటా ఇచ్చే అవకాశాలు లేకపోలేదు.