ప్రతి మనిషి జీవితంలో కొన్ని ప్రత్యేకమైన మెమోరీస్ ఉంటాయి.. ముఖ్యంగా చాలామందికి అమ్మమ్మ వారింట్లో ఎన్నో తీపి గుర్తులు ఉంటాయి. అప్పట్లో చాలా మంది సెలవులు వచ్చాయి అంటే తప్పకుండా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్లి ఎంజాయ్ చేసేవారు. కానీ ప్రస్తుత కాలంలో పిల్లలకు అమ్మమ్మ ఇల్లు మామయ్య గారి ఇల్లు ఏది తెలియడం లేదు.. అలా సాధారణ జనాలకి కాకుండా సినీ ఇండస్ట్రీలో ఉండేటువంటి హీరోలకు కూడా అమ్మమ్మగారిల్లుతో ఎంతో మంచి బాండింగ్ ఉంది. అలా మంచు మనోజ్ కు అమ్మమ్మ గారితో ఎంతో మంచి బాండింగ్ ఉంది. ఒకానొక సమయంలో ఆయన చేసిన చిలిపి పని వల్ల ఆమె  మంచు మనోజ్ ని వెంబడించి మరీ కొట్టిందట. ఈ విషయాన్ని మనోజ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.. మరి ఆ వివరాలు ఏంటో చూద్దామా.. 

మంచు మనోజ్  ఇండస్ట్రీలో ఒక గొప్ప హీరో.. ఈయనకు జూనియర్ ఎన్టీఆర్ తో చిన్నతనం నుంచే మంచి బాండింగ్ ఉంది. ఇద్దరు ఒకే ఏజ్ కి సంబంధించిన వ్యక్తులు.. ఇద్దరు చిన్నతనం నుంచి కలిసిమెలిసి పెరిగారు. అలాగే ఇండస్ట్రీలో కూడా ఇద్దరు అడుగుపెట్టి హీరోలుగా నిలదొక్కుకున్నారు. అయితే అలాంటి మంచు మనోజ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని  చిన్నప్పటి ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ను అందరితో పంచుకున్నాడు. చిన్నతనంలో ఎన్టీఆర్ తో కలిసి ఒక సైంటిఫిక్  ఎక్స్పరిమెంట్ చేశామని, ఇదే సమయంలో మేమిద్దరం కలిసి ఒక ఫంక్షన్ కి వెళ్లి ఆడుకుంటున్నామని, అయితే ఎన్టీఆర్ ఒక బెలూన్ ని పట్టుకొని వెలిగిస్తున్నాడు.

అదే సమయంలో నేను దాన్ని పగలగొట్టాను.అది నేను పగలగొట్టగానే ఎన్టీఆర్ చేతికి కాలింది దాంతో ఎన్టీఆర్ బిగ్గరగా ఏడ్చాడు. వెంటనే అది గమనించిన మా అమ్మమ్మ ఆదిలక్ష్మమ్మ వచ్చి నన్ను  పరిగెత్తిస్తూ దెబ్బలు వాయించేసింది. బిడ్డను చంపేస్తావా అంటూ నన్ను బెదిరిస్తూ కొట్టేసింది.. ఈ ఇన్సిడెంట్ ను నేను ఎప్పటికీ మర్చిపోను అంటూ మంచు మనోజ్ చెప్పుకోచ్చారు. ఇక ఈ విషయాన్ని జూనియర్ ఎన్టీఆర్ సైతం ఒక ఇంటర్వ్యూలో పాల్గొని చెప్పుకుంటూ నవ్వారు.. ఈ విధంగా ఎన్టీఆర్ మనోజ్ ల మధ్య ఉన్నటువంటి బాండింగ్ గురించి బయట పెట్టడంతో సోషల్ మీడియాలో  ఈ వీడియో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: