మెగా కోడలు, ప్రముఖ హీరోయిన్ లావణ్య త్రిపాఠి తీవ్ర విషాదంలో మునిగిపోయింది. గ‌త కొన్నేళ్ల నుంచి ఆమె అల్లారుముద్దుగా పెంచుకుంటున్న శునకం తాజాగా మరణించింది. ఈ విషయాన్ని లావణ్య త్రిపాఠి సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ ఎమోషనల్ అయింది. `నేను ఇప్పటివరకు కలిసిన అత్యంత ముద్దుల కూతురు నువ్వు. నీకు వీలైతే నాకు టీ పెట్టడానికి కూడా ప్రయత్నిస్తావని నేను అంద‌రితో చెబుతుంటాను. నీది ఎంత అందమైన హృదయం, ఎంత తెలివైనదానివి..నువ్వు నిజంగా నాకు ప్రత్యేకమైనవాడివి. ప్రశాంతంగా విశ్రాంతి తీసుకో స్వీటీ` అంటూ లావ‌ణ్య ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టింది.


అలాగే త‌న పెట్ డాగ్ తో గ‌డిపిన మ‌ధుర క్ష‌ణాల‌ను ఫోటోల రూపంలో అంద‌రితో పంచుకుంది. లావ‌ణ్య పోస్ట్‌కి నెటిజ‌న్స్ `రెస్ట్‌ ఇన్‌ పీస్‌` అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్ర‌స్తుతం లావ‌ణ్య త్రిపాఠి ప్రెగ్నెంట్ గా ఉన్న సంగ‌తి తెలిసిందే. వ‌రుణ్ తేజ్, లావ‌ణ్య దంప‌తులు ఈ గుడ్ న్యూస్ ఇటీవ‌ల స్వ‌యంగా పంచుకున్నారు. ఇటువంటి టైమ్ లో పాపం లావ‌ణ్య త‌న పెట్ డాగ్ ను కోల్పోవ‌డం అనేది నిజంగా విచార‌మే. ఈ బాధ నుంచి ఆమె త్వ‌ర‌గా కోలుకోవాల‌ని మెగా ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.
కాగా, వ‌రుణ్ తేజ్ ను వివాహం చేసుకున్న అనంత‌రం కెరీర్ ప‌రంగా లావ‌ణ్య త్రిపాఠి స్లో అయింది. చాలా రోజుల‌కు `సతీ లీలావతి` అనే సినిమాకు సైన్ చేసింది. కొద్ది నెల క్రితం పూజా కార్య‌క్ర‌మాల‌తో ఈ ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్కింది. కానీ ఇంత‌లోనే లావ‌ణ్య త్రిపాఠి ప్రెగ్నెంట్ అయింది. కాబ‌ట్టి స‌తీ లీలావ‌తి డిలే అయ్యే అవ‌కాశాలు ఎక్కువగా క‌నిపిస్తున్నాయి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: