
ఇంటర్మీడియట్ వరకు నారా రోహిత్ లో కోపం విపరీతంగా ఉండేదట. చిన్న విషయానికి కూడా తెగ ఆవేశపడిపోయేవాడట. ఒక్కసారి ఆయనకు కోపం వచ్చిందంటే అదుపు చేయడం ఎవరి తరం అయ్యేది కాదట. ఎంతమంది ఉన్నా అందర్నీ నెట్టేసి దూసుకెళ్లిపోయేవాడట. దాంతో ఆయనకు కోపిష్టి అనే ముద్ర పడిపోయింది. అయితే ఒక దశలో నారా రోహిత్ లో పరివర్తన వచ్చింది. కోపం తగ్గించుకోవాలని సంకల్పించుకున్న ఆయన.. తనను తాను పూర్తిగా మార్చుకున్నారు. ఎవరు ఎంత రెచ్చగొట్టినా మౌనం వహించడం అలవాటు చేసుకున్నారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నారా రోహిత్ ఈ విషయాన్ని స్వయంగా బయటపెట్టారు. కోపం అనేక అనర్థాలకు మూలమవుతుంది.. ఎంతో మనోఫలం ఉంటే తప్ప దాన్ని కంట్రోల్ చేసుకోవడం సాధ్యం కాదు. ఒక అలవాటు ప్రకారం తనలోని కోపాన్ని తగ్గించుకున్నానని.. ప్రస్తుతం ప్రశాంత్ గా ఉంటున్నానని నారా రోహిత్ చెప్పుకొచ్చాడు. కాగా, లాంగ్ గ్యాప్ అనంతరం నారా రోహిత్ రీసెంట్ గా `భైరవం` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ నటించిన ఈ మల్టీస్టారర్ కు విజయ్ కనకమేడల దర్శకుడు. మే30న మంచి అంచనాల నడుమ విడుదలైన భైరవం మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే నారా రోహిత్ క్యారెక్టర్ కి మాత్రం విమర్శకుల ప్రశంసలు దక్కాయి.