
అలాగే ఎన్టీఆర్ విజువల్స్ కూడా ఎంతో స్టన్నింగ్ గా ఉన్నాయని స్క్రీన్ మీద వీరిద్దరూ చెలరేగిపోవుటుంటే చూడడానికి సిద్ధంగా ఉన్నామని అంటున్నారు . అయితే వార్2 మీద అంచనాలు పెంచుతున్న విషయాల్లో ఎన్టీఆర్ , హృతిక్ సాంగ్ కూడా ఒకటి .. ఈ పాటను ఈ నెల చివర్లో షూటింగ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు .. అలాగే ఇద్దరు హీరోలు వారం రోజుల పాటు ఈ సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నారు. ఇప్పటికే ఈ సాంగ్ షూటింగ్ కోసం ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టేసారు ఎన్టీఆర్ , హృతిక్. నాటు నాటు తో ఎన్టీఆర్ , చరణ్ స్టెప్పులు చూసిన వారందరూ ఇప్పుడు వార్ 2 సాంగ్ మీద ఊహించని లెవల్ లో అంచనాలు పెట్టుకున్నారు .
హృతిక్ , ఎన్టీఆర్ ఇద్దరూ ఇండియాలోని బెస్ట్ డాన్సర్స్ కావడంతో ఈ సాంగ్ వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల్ని ఊపుతుందని సినీ అభిమానులు ఎంతో నమ్మకం పెట్టుకున్నారు .. ఇదే క్రమంలో ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ కూడా ఊహించిన స్వీడ్ లో జరుగుతుంది .. ఈ మూవీ కోసం కూడా స్పెషల్ సెట్ ని డిజైన్ చేస్తున్నారు మేకర్స్. అయితే ఈ నెల మూడో వారం నుంచి అక్కడే షూటింగ్ మొదలు పెట్టనున్నారు ఎన్టీఆర్ తో పాటు సినిమాలో నటించే కీలక నటీనటులందరూ ఆ షెడ్యూల్లో పాల్గొంటారట . ప్రశాంత్ సినిమా కి ఈ సీక్వెన్స్ ఎంతో హైలెట్ అవుతుందని అంటున్నారు .