డైలాగ్ కింగ్ మోహ‌న్ బాబు కోడ‌లు, మంచు విష్ణు స‌తీమ‌ణి మంచు విరానికా గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. రాజ‌కీయ నేప‌థ్యం ఉన్న ఫ్యామిలీలో జ‌న్మించిన విరానికా.. 2009లో విష్ణుతో ఏడ‌డుగులు వేసింది. ఈ దంప‌తుల‌కు న‌లుగురు సంతానం. భారీ ఫిల్మ్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న‌టువంటి కుటుంబానికి విరానికా కోడ‌లే అయినా.. ఆమె త‌న‌కంటూ ఒక స్పెష‌ల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. వ్యాపార రంగంలో సూప‌ర్ క్వీన్ గా చ‌క్రం తిప్పుతోంది. అది కూడా ఇంటర్నేషనల్ లెవ‌ల్ లో.


న్యూయార్క్ లో పుట్టి పెరిగిన విరానికా.. ఫ్యాషన్ మార్కెటింగ్ లో విద్యావంతురాలు. ఇంటర్నేషనల్ బిజినెస్ స్కూల్‌లో స్ట‌డీస్ కంప్లీట్ చేసింది. 2022లో `మైసన్అవా` పేరుతో కిడ్స్ కోసం విరానికా ల‌గ్జ‌రీ క్లాతింగ్ బ్రాండ్ ను ప్రారంభించింది. అన‌తి కాలంలోనే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఈ బ్రాండ్ 14 ఏళ్ల లోపు పిల్లలకు ప్రత్యేకంగా డిజైన్ చేసిన దుస్తులను విక్రయిస్తుంది. కంఫర్ట్ అండ్‌ చైల్డ్-ఫ్రెండ్లీ డిజైన్డ్ దుస్తులకు మైసన్ అవా పెట్టింది పేరు.


దాంతో బాలీవుడ్ మ‌రియు హాలీవుడ్ సెలబ్రిటీలు తమ పిల్లలకు ఈ బ్రాండ్ నుండే దుస్తుల‌ను ఎంపిక చేస్తుంటారు. ఇప్ప‌టికే విరానికా క్లాతింగ్ బ్రాండ్ 14 దేశాల‌కు విస్త‌రించింది. వ‌ర‌ల్డ్ వైడ్ గా మైస‌న్ అవాకు 48 స్టోర్లు ఉన్నాయి. అంతేకాదండోయ్‌.. లండన్‌లోని 175 ఏళ్ల చరిత్ర కలిగిన హోరోడ్స్ స్టోర్‌లో మైస‌న్ అవా బ్రాండ్ స్టోర్ ప్రారంభించిన మొట్ట‌మొదటి ఇండియ‌న్ ఫ్యాషన్ డిజైనర్ గా విరానికా ఒక రికార్డును కూడా నెల‌కొల్పింది. బిజినెస్ రంగంలో త‌న భార్య ఎంతో తోపో తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో మంచు విష్ణు స్వ‌యంగా బ‌య‌ట‌పెట్టారు. కాగా, ప్ర‌స్తుతం విష్ణు `క‌న్న‌ప్ప‌` ప్ర‌మోష‌న్స్ లో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం జూన్ 27న గ్రాండ్ రిలీజ్ కాబోతుంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు


మరింత సమాచారం తెలుసుకోండి: