
బాలయ్య పుట్టినరోజు కానుకగా ఈరోజు అఖండ 2 నుంచి స్పెషల్ సర్ప్రైజ్ కూడా రాబోతుంది .. ఇప్పటికే 100 కు పైగ సినిమాలో నటించిన బాలయ్య తన కెరీర్లో ఎంతోమంది హీరోయిన్స్‌తో కలిసి నటించారు .. అయితే అందులో ఒక హీరోయిన్ మాత్రం ఆయనకు ఎంతో దగ్గర బంధువు అవుతుంది .. అలాగే ఒకప్పుడు బాలయ్యతో కలిసి నటించిన హీరోయిన్ ఆ తర్వాత అదే బాలకృష్ణకు వరుసకు కోడలుగా అవుతుంది .. ఇంతకీ ఆమె మరెవరో కాదు లేడీ సూపర్ స్టార్ విజయశాంతి . అప్పట్లో బాలకృష్ణ , విజయశాంతి సక్సెస్ఫుల్ కాంబినేషన్ . రౌడీ ఇన్స్పెక్టర్ , నిప్పు రవ్వ లాంటి హిట్ సినిమాలు వీరి కాంబోలో వచ్చాయి .. ఈ సినిమాల విషయం పక్కనబెడితే విజయశాంతి 1988 లో ఎమ్వీ శ్రీనివాస్ ప్రసాద్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది .
ఆయనకు బాలయ్య మధ్య ఎంతో మంచి అనుబంధం ఉంది బాలయ్యకు శ్రీనివాస్ ప్రసాద్ వరసకు కొడుకు అవుతారు .. బాలకృష్ణ పెద్ద బావ గణేష్ రావుకు శ్రీనివాస్ స్వయానా మేనల్లుడు . ఈయనకు బాలయ్యకు మధ్య కూడా మంచి స్నేహ అనుబంధం ఉంది .. ఈ ఫ్రెండ్షిప్ తోనే బాలయ్యతో కలిసి ఓ సినిమా చేయాలని .. యువరత్న ఆర్ట్స్ స్థాపించి నిప్పురవ్వ సినిమాను తీశారు .. ఈ సినిమాలో హీరోయిన్ రోల్ కోసం స్వయంగా విజయశాంతి దగ్గరికి వెళ్లారు ప్రసాద్ .. అలా వారి పరిచయం కాస్త ప్రేమగా మారి ఆ తర్వాత పెళ్లి బంధంగా మారింది .. అలా విజయశాంతితో స్క్రీన్ షేర్ చేసుకున్న బాలకృష్ణ ఆ తర్వాత ఆమెకు వరసకు మామయ్యగా మారారు .