
సాధారణంగా చాలామంది హీరోలు లగ్జరీ కార్లు, స్పోర్ట్స్ బైక్స్, వాచెస్ పై ఎక్కువగా మక్కువ చూపుతుంటారు. వాటికోసం కోట్లకు కోట్లు ఖర్చు చేస్తుంటారు. అయితే మంచు విష్ణుకి ఆర్ట్ అంటే మహా ఇష్టమట. ఇప్పటివరకు ఎన్నో రకాల పెయింటింగ్స్ లక్షలు పెట్టి కొనుగోలు చేశాడట. 2014లో బాంబే నుంచి ఒక ఫేమస్ ఆర్టిస్టును పిలిపించి పద్మావతి అమ్మవారి పెయింటింగ్ వేయించాడట. అందుకుగానూ సదరు ఆర్టిస్ట్ మూడు లక్షలు ఛార్జ్ చేశారట. అయితే ఇప్పుడు ఆ పెయింటింగ్ విలువ రూ. 2 కోట్ల వరకు ఉంటుందని తాజా ఇంటర్వ్యూలో మంచు విష్ణు స్వయంగా తెలిపాడు.
అలాగే మోహన్ బాబు యూనివర్సిటీలోని లైబ్రరీలో మంచు విష్ణు కలెక్ట్ చేసిన పెయింటింగ్స్ అన్ని ఏర్పాటు చేశారట. ఆ లైబ్రరీలో ఉన్నటువంటి ఆర్ట్ కలెక్షన్ విలువ సుమారు రూ. 25 కోట్ల వరకు ఉంటుందని మంచు విష్ణు తెలిపాడు. అంతే కాదండోయ్ అప్పుడప్పుడు ఈ పెయింటింగ్స్ ను వేలం పాటలో పెట్టి విక్రయిస్తాడట. అలా వచ్చిన డబ్బుతో ఒకరిని దత్తత తీసుకొని చదివిస్తానని కూడా విష్ణు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు