పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్గా హరీష్ శంకర్ దర్శకత్వంలో కొన్ని సంవత్సరాల క్రితం గబ్బర్ సింగ్ అనే మూవీ రూపొంది అద్భుతమైన విజయాన్ని సాధించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కంటే ముందు పవన్ కళ్యాణ్ అనేక అపజయాలను ఎదుర్కొని చాలా డీలా పడిపోయి ఉన్నాడు. అలాంటి సమయంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన గబ్బర్ సింగ్ మూవీ తో పవన్ కళ్యాణ్ కు అద్భుతమైన విజయం దక్కింది. అలా పవన్ కళ్యాణ్ వరుస అపజయాల ఉన్న సమయంలో ఆయనకు అద్భుతమైన విజయాన్ని అందించిన హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ మరో మూవీ చేస్తే బాగుంటుంది అని పవన్ అభిమానులు ఎంతో కాలంగా అభిప్రాయపడుతూ వస్తున్నారు.

అలాంటి సమయం లోనే పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ అనే మూవీ అనౌన్స్మెంట్ వచ్చింది. దానితో పవన్ అభిమానులు ఫుల్ ఖుషి అయ్యారు. కానీ ఆ తర్వాత ఈ సినిమా తేరి అనే మూవీ కి రీమిక్ గా రూపొందుతుంది అని వార్తలు రావడంతో ఆ సినిమా అప్పటికే తెలుగులో పోలీసోడు అనే టైటిల్ తో తెలుగులో కూడా విడుదల కావడంతో పవన్ ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అయ్యారు. ఇకపోతే గత కొన్ని రోజుల క్రితం నుండి హరీష్ శంకర్ , ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ని తేరి సినిమాకు రీమేక్ గా కాకుండా కొత్త కథతో రూపొందిస్తున్నట్లు వార్తలు బయటకు వచ్చాయి.

దానితో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు. ఈ మూవీ షూటింగ్ కొంత శాతం పూర్తి అయిన తర్వాత కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. తిరిగి ఈ మూవీ షూటింగ్ తాజాగా ప్రారంభం అయింది. ఈ మూవీ లో శ్రీ లీల హీరోయిన్గా నటిస్తోంది. పవన్ , శ్రీ లీల ఇద్దరు కూడా తాజా షెడ్యూల్లో జాయిన్ అయినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమా ఒరిజినల్ కథతో రూపొందుతుందా ..? లేక తేరీ మూవీ కి రీమేక్ గా పొందుతుందా అనే దానిపై స్పష్టత లేకపోవడంతో పవన్ అభిమానులు కాస్త కంగారు పడుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: