- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

ఇక మన టాలీవుడ్ సినీ హీరోలు ఫుల్ స్పీడ్ లో ఉన్నారు .. ఏదో అడపాదడపా సినిమాలు చేయకుండా కుర్ర హీరోలకు పోటీ ఇచ్చే రేంజ్ లో సీరియస్ గా కేరీర్‌ మీద ఫోకస్ పెడుతున్నారు .. కథల ఎంపిక నుంచి సినిమా స్పాన్ జోనర్ల అన్ని విషయాల్లోనూ మాకేం తక్కువ అన్నట్లుగా అదరగొడుతున్నారు .. ఇక దాంతో తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ వర్సెస్ జూనియర్స్ ఫైట్ గట్టిగా నడుస్తుంది. పాన్ ఇండియ‌ సినిమాలు చేస్తున్న యంగ్ హీరోలు ఎక్కువ గ్యాప్ తీసుకుంటే .. సీనియర్ హీరోలు మాత్రం జెట్‌ స్పీడుతో అదరగొడుతున్నారు ఒక్క సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను ఓకే చేస్తూ అభిమానులను ఖుషి చేస్తున్నారు .. చిరంజీవి , బాలయ్య విషయంలో ఇది మరింత స్పీడ్ గా ఉన్నారు విశ్వంభర , అనిల్ రావిపూడి సినిమాలతో బిజీగా ఉన్న చిరంజీవి ఆ తర్వాత శ్రీకాంత్ ఓదెల‌తో సినిమాకు ఓకే చెప్పేశారు.

అలాగే బాలయ్య కూడా ఇంతే స్పీడ్ గా సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు .. అఖండ 2 షూటింగ్లో పాల్గొంటూనే గోపీచంద్ మలినేని కాంబినేషన్లో ఓ భారీ హిస్టారికల్ సినిమాకి ఓకే చెప్పారు . ఇక రీసెంట్గా సంక్రాంతికి వస్తున్నాం విజయం తో మంచి ఫామ్ లో ఉన్న వెంకటేష్ నెక్స్ట్ సినిమా విషయం లో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు .. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారు.  ఇక సోలోగా సినిమాలు చేయకపోయినా నాగార్జున కూడా బిజీబిజీగా నడుస్తున్నారు .. ధనుష్ తో కలిసి చేసిన కుబేర రిలీజ్ కు రెడీ అవుతుంది .. మరోవైపు రజినీకాంత్ కూలీలో గెస్ట్ రోల్ లో నడుస్తున్నారు .. అలాగే తన 100వ‌ సినిమా కోసం భారీ ప్లానింగ్ లో ఉన్నారు నాగార్జున .. ఇలా సీనియర్ హీరోలు అంత వరుస సినిమాల తో కుర్ర హీరోలకు గట్టి షాక్ ఇస్తున్నారు .

వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి ..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి .

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు ..

మరింత సమాచారం తెలుసుకోండి: