
అఖండ2 సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాలో కథ, కథనం కొత్తగా ఉండనున్నాయని తెలుస్తోంది. అఖండ2 సినిమాకు యాక్షన్ సన్నివేశాలు హైలెట్ గా నిలవనున్నాయని తెలుస్తోంది. ఓవర్సీస్ 2 లో మిలియన్ డాలర్ల టార్గెట్ తో ఈ సినిమా విడుదలవుతోంది. అఖండ2 ఓవర్సీస్ లో సైతం కలెక్షన్ల విషయంలో సంచలనాలను సృష్టిస్తే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు.
బాలయ్య అఖండ2 సినిమాతో సులువుగా 100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సొంతం చేసుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అఖండ2 సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అఖండ2 సినిమా సెప్టెంబర్ నెల 25వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాకు పోటీగా ఓజీ సినిమా విడుదల కానుంది.
అఖండ2 సినిమా నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతుండగా ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ సినిమా బీజీఎమ్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. అఖండ2 సినిమా ఏ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది. అఖండ2 సినిమా పాన్ ఇండియా మూవీగా విడుదల కానుండగా ఈ సినిమా సక్సెస్ సాధించడం బోయపాటి శ్రీను కెరీర్ కు సైతం కీలకం కానుంది.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు