బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు . సల్మాన్ ఖాన్ ఇప్పటివరకు ఎన్నో సినిమా ల లో నటించి , ఎ న్నో విజయాలను అందుకొని ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపు ను సంపాదించుకున్నాడు . అలాగే వరల్డ్ వైడ్ గా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నా డు . ఇది ఇలా ఉంటే తాజాగా సల్మాన్ ఖాన్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు . అందులో భాగంగా ఈ తరం జంటలు ఎలా ఉంటున్నా రు ..? ఎందుకు విడాకుల వరకు వెళుతున్నారు. అనే దానిపై ఆయన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు.

తాజాగా సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ ... ఒకప్పుడు భార్య , భర్తల మధ్య ఎంతో గొప్ప ప్రేమ , నమ్మకం ఉండేది. అలాగే వారిద్దరి మధ్య అర్థం చేసుకునే స్వభావాలు కూడా ఎక్కువ శాతం ఉండేది. అలాగే ఒకరి కోసం ఒకరు ఏ త్యాగం అయిన చేయడానికి అస్సలు వెనకాడే వారు కాదు. కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితులు చాలా వరకు మారాయి. ఒక చిన్న అపార్థం కూడా విడాకుల వరకు వెళుతుంది అని తాజాగా సల్మాన్ ఖాన్ ఓ ఇంటర్వ్యూ లో భాగంగా చెప్పుకొచ్చాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సల్మాన్ ఖాన్ వయస్సు 59 సంవత్సరాలు.

ఇప్పటికి కూడా ఈయన పెళ్లి చేసుకోకుండా బ్యాచిలర్ గానే ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఇకపోతే సల్మాన్ ఖాన్ ఈ మధ్య కాలంలో అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాలను అందుకోలేదు. ఆఖరుగా సల్మాన్ ఖాన్ తమిళ దర్శకుడు ఏ ఆర్ మురగదాస్ దర్శకత్వంలో రూపొందిన సికిందర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మంచి అంచనాలు నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: