పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రీసెంట్‌గా ముంబైలోని బాంద్రా ఏరియాలో సమంత తన జిమ్ సెషన్ ముగించుకుని బయటకు వచ్చింది. స్కిన్ టైట్ స్పోర్ట్స్ వేర్ లో సూపర్ హాట్ గా ఉన్న సామ్.. ఎవరితోనూ ఫోన్ మాట్లాడుకుంటూ కారు ఎక్కేందుకు వెళుతుండగా అక్కడే ఉన్న కొందరు ఫోటోగ్రాఫర్లు ఆమె వెంటపడ్డారు. ఫోటోలు తీయొద్దని చెప్పినా వారు వెనక్కి తగ్గలేదు. దాంతో తీవ్ర అసహనానికి గురైన సమంత.. `స్టాప్ ఇట్ గైస్` అంటూ ఫోటోగ్రాఫర్లపై చిర్రుబుర్రలాడింది. ఆ వెంటనే కారెక్కి వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కాగా, సమంత కెరీర్ విషయానికి వస్తే.. రీసెంట్ గా `శుభ్రం` మూవీతో నిర్మాతగా క్లీన్ హిట్ ను ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ స్వీయ నిర్మాణంలో `మా ఇంటి బంగారం` అనే సినిమా చేస్తోంది. అలాగే బాలీవుడ్ దర్శకద్వయం రాజ్ అండ్ డీకే డైరెక్షన్ లో నెట్‌ఫ్లిక్స్ కోసం `రక్త బ్రహ్మాండం: ది బ్లడీ కింగ్డమ్` అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఈ రెండు ప్రాజెక్ట్స్ ఇప్పుడు సెట్స్ మీదే ఉన్నాయి.ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి