- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

నయనతారను ఓ సినిమాకు ఒప్పించడానికి చాలా కష్టపడాలి .. పైగా ఇప్పుడు పెళ్లయి ఇద్దరు పిల్లలకు తల్లి అయింది. ఒక సినిమా చేయాలంటే ఆమెకు ఉన్న క్రేజ నేప‌థ్యంలో భారీ రెమ్యూనరేషన్ ఇవ్వాలి. సినిమాకు ఒప్పించడానికి ఇంత కష్టపడాలి .. ఇక ఆమె ప్రమోషన్ల వైపు అస్సలు చూడరు. ఎంత పెద్ద సినిమా అయినా కూడా నయనతార ప్రమోషన్లు చేయడానికి రారు. రజినీకాంత్ - అజిత్ లాంటి పెద్ద హీరోలతో సినిమాలు చేసిన ఆమె ఏనాడు ప్రమోషన్లు చేసింది లేదు. సినిమా ఒప్పుకునేటప్పుడే ఆమె ఈ విషయం క్లియర్ గా చెప్పేస్తుంది. అందుకు ఓకే చెప్పే ఆమెతో సినిమాలు చేయటానికి సిద్ధపడతారు నిర్మాతలు. అయితే చిరంజీవి - అనిల్ రావిపూడి సినిమా విషయంలో మాత్రం నయనతార తన రూల్స్ పూర్తిగా పక్కన పెట్టింది.


ఈ సినిమాలో ఆమె హీరోయిన్గా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆమెతో ఓ ప్రమోషనల్ వీడియో కూడా చేయిం చేశారు. నయనతారలో సడన్ గా ఇంత మార్పు ఏంటి ? అసలు ఆమె ఎంతో ఇష్టపడే తమిళ సినిమాలకు సైతం ప్రమోషన్లకు వెళ్ళని .. ఆమె తెలుగులో ప్రమోషనల్ వీడియో చేయడమేంటి ? అయితే ఈ మార్పు వెన‌క ఓ సీక్రెట్ ఉందట. నయనతారకు ఈ సినిమా కోసం ఇచ్చే రెమ్యున‌రేష‌న్‌కు అదనంగా మరో రెండు కోట్లు ఇస్తున్నారట. అది కేవలం ప్రమోషన్స్ కోసం అని తెలుస్తుంది. ఆ రెండు కోట్ల కోసం నయనతార ఈ సినిమాను ప్రమోట్ చేయడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈ సినిమా మాత్రమే కాదు అల్లు అర్జున్ - అట్లీ కాంబోలో ఓ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.


ఇందులో దీపికా పదుకొనే హీరోయిన్సినిమా ప్రమోషన్లకు దీపిక రానని ముందే చెప్పిందట. అందుకోసం అదనంగా చెల్లించడంతో దీపిక కూడా ప్రమోషన్లకు వచ్చేందుకు ఓకే చెప్పిందట. ఏది ఏమైనా ఇప్పుడు ప్రమోషన్లకు కూడా సపరేట్ రెమ్యునరేషన్ ఇచ్చుకోవాల్సిన దుస్థితి నిర్మాతలకు వచ్చేసింది. హీరోయిన్ల వల్ల ఈవెంట్స్ కు గ్లామర్ రావచ్చు ఏమోగానీ .. ఆ ప్రమోషన్లను చూసి జనాలు థియేటర్లకు వస్తారా ? వాళ్ళ వల్ల ఎక్కువ టికెట్లు తెగుతాయా అన్నది నిర్మాతలు ఆలోచించుకోవాలి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: