తాజాగా ఫణీంద్ర అనే దర్శకుడు 8 వసంతాలు అనే సినిమాను రూపొందించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ఆనంతిక హీరోయిన్గా నటించింది. ఈ మూవీ ని తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన నిర్మాణ సంస్థలలో ఒకటి అయినటువంటి మైత్రి సంస్థ వారు నిర్మించారు. ఈ సినిమాను ఈ మూవీ ని జూన్ 20 వ తేదీన థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ఓ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు.

ఈవెంట్ లో భాగంగా ఈ సినిమా నిర్మాతలలో ఒకరు అయినటువంటి రవి శంకర్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. తాజా ఈవెంట్ లో భాగంగా మైత్రి నిర్మాతలలో ఒకరు అయినటువంటి రవి శంకర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తాజాగా 8 వసంతాలు సినిమా ఈవెంట్లో భాగంగా మైత్రి నిర్మాతలలో ఒకరు అయినటువంటి రవి శంకర్ మాట్లాడుతూ ... 8 వసంతాలు మూవీ లో హీరోయిన్ పాత్ర చాలా గొప్పగా ఉంటుంది. ఆ పాత్రలో నటించే హీరోయిన్ కోసం దేశం మొత్తం తిరిగి అనంతిక ను ఈ సినిమాలో హీరోయిన్గా ఎంపిక చేసుకున్నాం అని రవి శంకర్ తెలిపారు.

ఇక దర్శకుడు ఫణీంద్ర కోరిక మేరకు క్లాసికల్ డాన్స్ మరియు మార్షల్ ఆర్ట్స్ వచ్చిన అమ్మాయి అయినటువంటి అనంతిక ను ఈ మూవీ లో హీరోయిన్గా సెలెక్ట్ చేసాం అని అన్నారు. ఈ మూవీ కోసం అనంతిక చాలా హార్డ్ వర్క్ చేసింది అని కూడా రవి శంకర్ తెలిపారు. ఇకపోతే 17 నుండి 25 సంవత్సరాల మధ్య వయసులో ఉన్న యువతి జీవితంలో జరిగే సంఘర్షనే ఈ మూవీ అని రవి శంకర్ పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: