రష్మిక మందన్నా.. ఇప్పుడు ఇండస్ట్రీలో ఏ స్టార్ నోట విన్నా కూడా ఈ పేరే వినిపిస్తుంది . నేషనల్ క్రష్ గా తన కంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రష్మిక మందన్నా.. తాజాగా నటించిన సినిమా "కుబేర".  శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా నాగార్జున కీలకపాత్రలో కనిపించిన ఈ సినిమాలో హీరోయిన్గా రష్మిక మందన్నా నటించ లేదు జీవించేసింది అంటున్నారు జనాలు.  రష్మిక మందన్నా ఈ సినిమాలో నటించడం పట్ల పాజిటివ్ కామెంట్స్ ఎక్కువగా దక్కించుకుంటూ వస్తుంది .


సాధారణంగా రష్మిక సినిమా ఏది రిలీజ్ అయిన సరే ఆమెపై నెగిటివ్ కామెంట్స్ ఎక్కడొ  ఒకచోట కనిపిస్తూనే ఉంటాయి.  కానీ ఫర్ ద ఫస్ట్ టైం రష్మిక మందన్నా నటించిన సమీరా క్యారెక్టర్ కి ఒక్కటంటే ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా రాలేదు . ప్రతి ఒక్కరు కూడా సమీరా క్యారెక్టర్ లో నటించిన రష్మికను పొగిడేస్తున్నారు . రష్మిక నటన బాగుంది అని మంచి స్టోరీ చూస్ చేసుకుంది అని ఇలాంటి స్టోరీస్ చూస్ చేసుకుంటే రష్మిక కెరియర్ ఇంకా బాగుంటుంది అంటూ సజెస్ట్ చేస్తున్నారు.



మరి ముఖ్యంగా శేఖర్ కమ్ముల కూడా " ఇండియాలో స్టార్ హీరోల కన్నా బిజీగా ఉండే యాక్టర్ రష్మిక అంటూ పొగడడం" ఓ  రేంజ్ లో వైరల్ అవుతుంది . కాగా ఇప్పుడు రష్మిక నటించిన లాస్ట్ సినిమాల క్యారెక్టర్స్ కి సంబంధించి ఓ న్యూస్ ని బాగా వైరల్ చేస్తున్నారు అభిమానులు . అనిమల్ సినిమాలో  గీతాంజలి పాత్రలో మెరిసింది రష్మిక మందన్నా.  ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత పుష్ప సినిమాలో  శ్రీవల్లి క్యారెక్టర్లు మెరిసింది రష్మిక మందన్నా.  ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యింది.  ఆ తర్వాత ఛావా సినిమాలో నటించింది.  ఈ సినిమా కూడా హిట్ అయ్యింది.



ఆ తర్వాత సల్మాన్ ఖాన్ తో నటించిన సినిమా మాత్రం ఫ్లాప్ అయ్యింది.  ఇప్పుడు కుబేర . ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యింది.  ఈ క్రమంలోనే గీతాంజలి - శ్రీవల్లి - సమీరా క్యారెక్టర్ ల కు ఉన్న ఒక కామన్  పాయింట్లు హైలెట్ చేస్తున్నారు అభిమానులు.  మూడు పాత్రలో కూడా రష్మిక హోంలీ  పర్ఫామెన్స్ ఇచ్చింది అని ఎక్కడా కూడా ఇది  నెగెటివిటీ అనే విధంగా ఎక్స్పోజ్ చేయలేదు అని మాట్లాడుకుంటున్నారు. అనిమల్ సినిమాలో కొన్ని కొన్ని సీన్స్ అలా ఉన్నా కూడా అది కేవలం డైరెక్టర్ రాసిన స్టోరీనే కానీ మిగతా అంతా కూడా రష్మిక చాలా క్లీన్ అండ్ గ్రీన్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది అని .. గీతాంజలి పాత్రను మించిపోయేలా  శ్రీవల్లి ఉంటే .. శ్రీవల్లి పాత్రను మించిపోయేలా సమీరా ఉంది అని .. రష్మిక ఇలాంటి క్యారెక్టర్ చూస్ చేసుకుంటేనే బాగుంటుంది అని .. ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు . సోషల్ మీడియాలో ఇప్పుడు రష్మిక కి సంబంధించిన ఈ న్యూస్ బాగా వైరల్ చేస్తున్నారు అభిమానులు..!

మరింత సమాచారం తెలుసుకోండి: