`సంక్రాంతికి వస్తున్నాం` మూవీతో ఈ ఏడాదిని ఘనంగా ప్రారంభించిన విక్టరీ వెంకటేష్.. ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి ఎటువంటి అప్డేట్స్ లేకపోవడంతో దగ్గుబాటి ఫ్యాన్స్ తెగ హైరానా పడిపోయారు. కానీ గ‌త నెల రోజుల్లోనే వెంకీ దాదాపు అర డజన్ ప్రాజెక్ట్స్ ను లైన్‌లో పెట్టార‌ట‌. ఆయన లైనప్ చూస్తే ఎవ‌రికైనా మతిపోవాల్సిందే.


మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ప్రస్తుతం `మెగా 157` వర్కింగ్ టైటిల్ తో ఓ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో వెంకీ ఒక ముఖ్యమైన పాత్ర‌లో కనిపించేందుకు ఓకే చెప్పారు. ఈ సినిమా కోసం వారం రోజులు పాటు వెంకీ కాల్షీట్స్ కూడా ఇచ్చారు.


ఆ వెంటనే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వెంక‌టేష్ ఓ సినిమా చేయబోతున్నారు. నాగ వంశీ నిర్మించబోయే ఈ చిత్రం ఆగస్టులో సెట్స్ మీదకు వెళ్ల‌బోతుంది. 2026 స‌మ్మ‌ర్ టార్గెట్ గా ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. మ‌రోవైపు మలయాళ బ్లాక్ పాస్టర్ `దృశ్యం` సినిమాకు పార్ట్-3 రాబోతోంది. డైరెక్టర్ జీతో జోసెఫ్ మలయాళంలో మోహన్ లాల్, తెలుగులో వెంకటేష్, హిందీ లో అజయ్ దేవగన్ ముగ్గురితోనూ ఒకేసారి `దృశ్యం 3` చిత్రాన్ని తెర‌కెక్కించాల‌ని ప్లాన్ చేస్తున్నారు. స్క్రిప్ట్ కూడా లాక్ అయింది.


దృశ్యం 3 అనంతరం వెంకటేష్, అనిల్ రావులపూడి కాంబినేషన్ లో `సంక్రాంతికి వస్తున్నాం` సినిమాకు సీక్వెల్ పట్టాలెక్క‌నుంద‌ని బ‌లంగా టాక్‌ నడుస్తుంది. 2027 సంక్రాంతికి ఈ చిత్రాన్ని తీసుకురానున్నార‌ని అంటున్నారు. అలాగే వెంకీ లైన‌ప్ లో తరుణ్ భాస్కర్ కూడా ఉన్నారు. అయితే వీరి ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అన్న‌ది క్లారిటీ కాలేదు.


ఇక వీటితో పాటే వెంకీ ఓ వెబ్ సిరీస్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఇప్పటికే `రానా నాయుడు` సిరీస్ తో వెంకీ డిజిటల్ ఎంట్రీ ఇచ్చి సూప‌ర్ క్రేజ్ సంపాదించుకున్నారు. అయితే రీసెంట్ గా ప్ర‌ముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ కోసం మ‌రో వెబ్ సిరీస్ చేసేందుకు వెంక‌టేష్ సంత‌కం చేసినట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: