సాధారణంగా ఇండస్ట్రీలో హీరోయిన్ అంటే హీరోయిన్ గానే చూస్తారు . అందంగా ఉంటుంది.. క్రేజ్ ఉంటుంది ..పాపులారిటీ ఉంటుంది సినిమాకి హై రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఉంటుంది . ఇంతే కానీ ఒక హీరోయిన్ స్టార్ హీరోలకి మించిన రేంజ్ లో పాపులారిటీ దక్కించుకుంటే ..కొన్నేళ్లైనా సరే ఆమె క్రేజ్ , పాపులారిటీ విషయంలో ఒక్క ఇంచ్ కూడా తగ్గకుండా ముందుకు వెళ్తుంటే ..మరీ ముఖ్యంగా తన ఆస్తిని రోజు రోజుకి నెల నెలకి సంవత్సరానికి డబల్ కాదు ట్రిపుల్ స్థాయిలో పెంపొందించుకుంటూ ఉంటే..  ఆమె హీరోయిన్ కాదు అంతకుమించి అనక తప్పదు . ప్రజెంట్ అలాంటి కామెంట్స్ దక్కించుకుంటుంది సౌత్ ఇండియా క్రెజియస్ట్ హీరోయిన్ నయనతార .


ఈ క్రేజీ హీరోయిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు.  100 కోట్లకు పైగానే స్థిరాస్తులు ఉన్నాయి . పూర్తిగా లగ్జరీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది. అయితే ఆమె సాధారణ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీ లోకి రావడం గమనార్హం.  మరీ ముఖ్యంగా నయనతార సినిమా హిట్ కోసం ఎంత తాపత్రయ పడేదో వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి అంతే ఇంట్రెస్ట్ చూపించేది.. కష్టపడేది అంటూ ఎంతో మంది డైరెక్టర్ లు పొగిడేశారు. కెరియర్ లో కొన్ని ఆటంకాలు కూడా ఎదుర్కొంది . కానీ నెగిటివిటీని కూడా పాజిటివ్ గా మార్చుకునే హీరోయిన్ నయనతారనే .


ఇప్పుడు నయనతార ఆస్తులు విలువలు చూస్తే స్టార్ హీరోలు కూడా దిగదుడిపే అనిపిస్తుంది. సుమారు 100 కోట్లకు పైగా ఇస్తే స్ధిర ఆస్తులు సంపాదించి పెట్టుకునింది.  నయనతార 2021 లో ఆమె తన డ్రీమ్ లగ్జరీ హౌస్ కు మారిపోయింది . 16,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో కొలువుదీరిన ఈ భారీ నివాసంలో నాలుగు పడకగదులతో పాటు అత్యాధునిక టెక్నాలజీకి సంబంధించిన అన్ని అమర్చుకుంది . పూర్తిగా తన ఇష్టా ఇష్టాలతో ఈ ఇంటిని నిర్మించుకునింది . నయనతార ఒకటి కాదు రెండు కాదు అన్నీ కూడా ఆమె కి నచ్చిన విధంగా అమ్ర్చుకుంది.


గతంలో రాజులు ఏ విధంగా ఇల్లును నిర్మించుకునేవారో.. అంతకు డబుల్ స్థాయిలోనే రాజ భోగాలు అనుభవించే విధంగా నయనతార ఈ ఇల్లు డిజైన్ చేసుకుంది అంటూ చాలామంది మాట్లాడుకుంటూ వచ్చారు. కేవలం చెన్నైలో మాత్రమే కాదు ఆమెకు హైదరాబాద్లో.. దుబాయిలో .. ముంబైలో కూడా ఆస్తులు ఉన్నట్లు తెలుస్తుంది . తన తల్లిదండ్రులు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అయిన నయనతార మాత్రం కష్టపడి పైకి ఎదిగింది.  కేవలం సినిమాల పరంగానే కాదు ఆమె పలు బిజినెస్ లు చేసి కూడా మంచిగా సక్సెస్ అయ్యింది. మరీ ముఖ్యంగా నయనతార వద్ద బిఎండబ్ల్యూ , మెస్సిటేజ్ , ఫోర్డ్, టొయోటా కంపెనీలకు చెందిన అతి ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి . ప్రెసెంట్ ఇండియాలో ప్రియాంక చోప్రా ..దీపికా పదుకొనే.. కరీనాకపూర్ ..శిల్పాశెట్టి ఈ రేంజ్ లో హై అండ్ లగ్జరీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న వాళ్లల్లో నయనతార కూడా వస్తుంది. అందుకే అందరూ ఆమెను హీరోయిన్ కాదు అంతకుమించిన బ్యూటీ అంటూ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: