
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరో గా జాన్వీ కపూర్ హీరోయిన్గా టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా దర్శకత్వం లో వస్తున్న సాలిడ్ యాక్షన్ మూవీ పెద్ది .. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ కూడా ఎంతో శరవేగంగా జరుగుతుంది .. అయితే ఇప్పుడు మేకర్స్ రీసెంట్గా ఒక క్రేజీ యాక్షన్ ఎపిసోడ్ ను కంప్లీట్ చేయగా ఇప్పుడు మరో కొత్త రూమర్ బయటకు వచ్చింది .. రామ్ చరణ్ కెరియర్ లోనే భారీ హిట్ అయిన సినిమాల్లో రంగస్థలం కూడా ఒకటి .. ఆ సినిమాలో ఐటమ్ సాంగ్ లాంటి ఓ మాస్ నెంబర్ షూట్ కూడా ఇప్పుడు కంప్లీట్ చేసినట్టు ఓ రూమర్ వినిపిస్తుంది ..
కేవలం కొన్ని రోజుల క్రితమే ఫైట్ సీన్ ఇప్పుడు ఐటమ్ సాంగ్ ని కంప్లీట్ చేశారంటే ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయమే .. ఇక ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించగా వృద్ధి సినిమాస్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు .. అలాగే ఈ సినిమాను వచ్చే ఏడాది గ్రాండ్గా మార్చ్ 27న ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నారు .. అదేవిధంగా బుచ్చిబాబు ఈ సినిమా లో తన గురువు సుకుమార్ రూట్లోనే ఈ సినిమాను తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది .. రామ్ చరణ్ కూడా ఈ సినిమా పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు .. ఇక మరి బుచ్చిబాబు , చరణ్ కు ఎలాంటి సక్సెస్ ఇస్తాడో చూడాలి..
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ , సామాజిక సమస్యలు వివరాలు పంపండి ..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు , రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తం గా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి .
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు ..