ఫైనల్లి .. చాలామంది అభిమానులు వెయిట్ చేస్తున్న "కన్నప్ప"  మూవీ రిలీజ్ అయిపోయింది . ఎట్టకేలకు థియేటర్లో సక్సెస్ఫుల్గా మూవీ రిలీజ్ అయ్యింది.  కొద్దిసేపటి క్రితమే థియేటర్లో రిలీజ్ అయిన కన్నప్ప మూవీ పై హ్యూజ్ పాజిటివ్ టాక్ వచ్చేసింది . సినిమా అనౌన్స్మెంట్ నుంచి ఈ సినిమాపై నెగిటివ్ గానే మాట్లాడుకుంటూ వచ్చారు జనాలు . ఒక్కొక్క స్టార్ ఈ సినిమాలో తాక్ట్ చేస్తున్నారు అని తెలియగానే ఒక్కొక్క నెగిటివ్ పాయింట్ తుడిచిపెట్టుకుపోతూ వచ్చింది . ఎప్పుడైతే సినిమాలో ప్రభాస్ నటిస్తున్నాడని తెలిసిందో ఇక సినిమాకి పాన్ ఇండియా లెవెల్ క్రేజ్ వచ్చేసింది .


ప్రభాస్ ఈ సినిమాలో  నటించింది గెస్ట్ పాత్ర నే.  అయినా సరే సినిమాకి ఓ రేంజ్ లో హైప్ తీసుకొచ్చేలా ప్రభాస్ పాత్ర ఉంది.  ప్రభాస్ ఈ సినిమాలో రుద్ర అనే పాత్రలో కనిపిస్తాడు.  థియేటర్స్ లో ప్రభాస్ ఎంట్రీ సీన్ కి పూనకాలు వచ్చేస్తున్నాయి . అంతేకాదు ప్రభాస్  ఎంట్రీ సీన్ కోసం  మాత్రమే థియేటర్ కి వెళ్లిన జనాలు కూడా ఉన్నారు. ఈ సినిమాని హిట్ చేసిన వాళ్లలో సగం మంది రెబల్ ఫ్యాన్స్ అని చెప్పుకోక తప్పదు అంటున్నారు జనాలు .



కాగా ప్రభాస్ రుద్ర పాత్రలో చాలా చాలా లీనమైపోయినటించాడు అని సినిమా చూసిన ప్రతి ఒక్కరికి తెలిసిపోతుంది . పాన్ ఇండియా లెవల్ లో క్రేజ్ సంపాదించుకున్న హీరో ఇలాంటి క్యారెక్టర్లు కనిపిస్తాడు అని అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేకపోయారు . మొత్తానికి  అనుకున్నది సాధించేసాడు ప్రభాస్ . అయితే మంచు  విష్ణు ఈ సినిమాలో రుద్ర పాత్ర కోసం ముందుగా ప్రభాస్ కన్నా కూడా వేరొక హీరోని అనుకున్నారట.  ఆయన మరెవరో కాదు జూనియర్ ఎన్టీఆర్.



పాన్ ఇండియా రేంజ్ లో పాపులర్ రెడ్డి సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఈ క్యారెక్టర్ కి బాగుంటాడు అని అనుకున్నారట . కానీ ఆ తర్వాత తెలిసిన వాళ్ళ  ప్రభాస్ ఐతే ఇంకా బాగుంటాడు అని అది కృష్ణంరాజు డ్రీమ్ రోల్ అని చెప్పడంతో ప్రభాస్ ని అప్రోచ్ అవ్వగా  ప్రభాస్ సెకండ్ లోనే ఓకే చేసేసారట . దీంతో ఆ పాత్ర ఎన్టీఆర్ దగ్గర నుంచి ప్రభాస్ ఖాతాలోకి పడిపోయింది . ఏమాటకామాటే ప్రభాస్ రుద్ర పాత్రలో ఇరగదీసాడు . భలే చక్కగా నటించాడు అంటూ కామెంట్స్ దక్కించుకుంటున్నాడు.  సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా సరే కన్నప్ప సినిమా గురించి మాట్లాడుకుంటూ ఉంటే అందులో ప్రభాస్ ఉండి తీరాల్సిందే..!!

మరింత సమాచారం తెలుసుకోండి: