నిజానికి గత కొద్దిరోజులు నుంచి మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతలా గొడవలు జరుగుతున్నాయి. ఆస్తుల పంపకాల విషయంలో అన్నదమ్ముల మధ్య విభేదాలు తలెత్తాయని బలమైన టాక్ ఉంది. వీరి విభేదాలు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకునే వరకు కూడా వెళ్ళింది. ఈ విభేదాలు కొనసాగుతున్నంగానే ఇటీవల మంచు మనోజ్ ప్రధాన పాత్రలో నటించిన `భైరవం` సినిమా రిలీజ్ అయింది. ఈ మూవీకి మంచి ఫ్యామిలీ నుంచి ఎటువంటి సపోర్ట్ లభించలేదు.
కానీ మంజు విష్ణు టైటిల్ పాత్రలో మోహన్ బాబు నిర్మించిన కన్నప్ప సినిమా నేడు రిలీజ్ అవుతుండడంతో మనోజ్ నిన్ననే చిత్ర బృందానికి ప్రత్యేకంగా అభినందనలు చెబుతూ పోస్ట్ పెట్టాడు. అన్న పేరు ప్రస్తావించకపోయినప్పటికీ కన్నప్పకు తన వంతు ప్రమోషన్ చేసి మనోజ్ మంచి మనసు చాటుకున్నాడు. అక్కడితో ఆగాడు అనుకుంటే పొరపాటే.. ఎవరు ఊహించని విధంగా హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమాక్స్ లో కన్నప్ప సినిమాను శుక్రవారం మనోజ్ వీక్షించాడు.షో అయ్యాక బయటకు వచ్చిన మనోజ్.. కన్నప్ప సినిమా చాలా చాలా బాగుందని అభినందించాడు. ప్రభాస్ ఎంట్రీ తర్వాత సినిమా నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళిందని.. క్లైమాక్స్ అద్భుతంగా ఉందని రివ్యూ ఇచ్చాడు. సినిమాలో అందరూ గొప్పగా నటించారు.. కన్నప్ప మూవీ అంచనాలకు మించి ఉందని మనోజ్ మీడియాతో వెల్లడించాడు. ప్రస్తుతం ఈయన కామెంట్స్ వైరల్ గా మారాయి. మొత్తానికి మనోజ్ వ్యక్తిత్వం ఏంటో ఈ దెబ్బతో మరోసారి నిరూపితమైంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి