ఈ మధ్య కాలంలో నితిన్ చాలా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఏ సినిమాలు కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోవడం లేదు. వరుసగా నితిన్ నటించిన మాచర్ల నియోజకవర్గం , ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ , రాబిన్ హుడ్ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఇలా వరుస పరాజయాలతో కెరియర్ను నెట్టుకొస్తున్న నితిన్ తాజాగా తమ్ముడు అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ కి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించగా ... శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాలో నిర్మించాడు.

మూవీ లో వర్ష బొల్లమ్మ , సప్తమి గౌడ హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ ని జూలై 4 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకి సంబంధించిన ప్రచారాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఈ సినిమా నిర్మాత అయినటువంటి దిల్ రాజు ఈ మూవీ కి సంబంధించిన అనేక ఆసక్తికరమైన విషయాలను తెలియజేస్తూ ఈ సినిమాపై చేయడానికి చూస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ యూనిటీ ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసింది. ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి "ఏ" సర్టిఫికెట్ వచ్చినట్లు తెలుస్తుంది. ఇకపోతే ఈ మూవీ కి సెన్సార్ బోర్డ్ నుండి "ఏ" సర్టిఫికెట్ రావడంతో ఈ మూవీ లో భారీ రక్త పాత సన్నివేశాలు ఉన్నాయి అని తెలుస్తుంది.

ఇక దిల్ రాజు కూడా తాజాగా కొన్ని ఇంటర్వ్యూలలో ఈ సినిమాలో యాక్షన్ బ్లాక్ అద్భుతంగా వచ్చాయి అని , అవి ప్రేక్షకులను సూపర్ గా ఆకట్టుకుంటాయి అని చెప్పుకొచ్చాడు. దీనితో ఈ సినిమాకు కూడా "ఏ" సర్టిఫికెట్ రావడంతో ఈ మూవీలోని యాక్షన్ బ్లాక్లు అదిరిపోయే రేంజ్ లో ఉండి ఉంటాయి అని అనేక మంది ప్రేక్షకులు అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: