
సినీ ఇండస్ట్రీలోకి రావాలనుకొనే కొత్త దర్శక ,నిర్మాతలు, నటీనటులతో పాటు టెక్నీషియన్స్ కి కూడా తెలుసుకోవలసిన విషయాలు చాలానే ఉన్నాయని దిల్ రాజు డ్రీమ్స్ పేరిట ఒక వేదికను సైతం ఏర్పాటు చేశారు. ఈ వెబ్ సైట్ కి విజయ్ దేవరకొండ ,దేవి శ్రీ ప్రసాద్ చేతులమీదుగాని లాంచ్ చేసి ఇండస్ట్రీలో రావాలనుకునే కొత్త వారికి దిల్ రాజు ఇచ్చే సూచనలు ఏమిటంటే ఇక్కడ కేవలం ఒక్క శాతం మాత్రమే సక్సెస్ ఉంటుంది. 24 గంటలు కష్టపడితే తప్ప ఆ సక్సెస్ అందుకోలేమని తెలిపారు.
ముఖ్యంగా ఇండస్ట్రీలో జరిగే మోసాలు గురించి తెలుపుతూ తన కెరీయర్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ ని తెలిపారు..1996 లో తాను శిరీష్ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చామని.. మొదటిసారి ఒక సినిమా కొందామని హైదరాబాద్ కి వచ్చి దర్శక నిర్మాతలతో చర్చించి మరి సినిమా కొన్నామని.. సినిమా ఓపెనింగ్స్ రోజా తమకు ఆహ్వానం అందింది. నేను ,శిరీష్ సేట్ కు వెళ్లగానే సార్ మీరు చూడడానికి చాలా బాగా కనిపిస్తున్నారు సినిమాలో నటించండి అంటూ చెప్పారు. దానికి తాను కూడా ఓకే చెప్పానని అయితే ఆ మరుసటి రోజు షూటింగ్ కి వెళితే అక్కడ నాకు శిరీష్ కి ఒక పెద్ద బ్యానర్ కట్టారు.. సరే అని లోపలికి వెళ్ళగా కొన్ని గంటలపాటు కూర్చోబెట్టి మధ్యాహ్నం మేకప్ వేశారు. సాయంత్రం 6 గంటల తర్వాత తీసుకువెళ్లి ఒక అమ్మాయితో గంట కొట్టించి షూటింగ్ అయిపోయిందని చెప్పారని.. అయితే సినిమా కొంటున్నాం కాబట్టి అలా ఆకర్షించడానికి చేశారు.. ఈ విషయాన్ని తాము పసిగట్టాము ఇలాంటి చాలు ముందు సినిమా మొదలు పెట్టండి ?వాటిని కంప్లీట్ చేయండి అని చెప్పాము.. ఎందుకో వారి పద్ధతులు నచ్చకపోవడంతో చివరికి నేను శిరీష్ ,లక్ష్మణ్ చర్చించుకొని సినిమాని వదిలేసామని తెలిపారు దిల్ రాజు.. కొన్నిసార్లు రూ .2కోట్లు బడ్జెట్ అని చెప్పి.. నాలుగు కోట్ల రూపాయల వరకు చేస్తూ ఉంటారు.. అన్నిటిలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించారు.