టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు పర్సనల్ లైఫ్ గురించి తెలిసిందే. మొదటి భార్య అనిత అనారోగ్యంతో చనిపోయిన తర్వాత 2020లో దిల్ రాజు హైదరాబాద్ కు చెందిన తేజస్విని అనే యువతిని రెండో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు 2022లో ఒక కుమారుడు కూడా జన్మించాడు. ప్రస్తుతం దిల్ రాజు, తేజస్విని దంపతులు హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. అలాగే తేజస్విని గతంతో పోలిస్తే ఇటీవల సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా మారారు. భర్తతో వెకేషన్స్ కు వెళ్తూ అందుకు సంబంధించిన ఫోటోలను పంచుకుంటున్నారు. వ్యక్తిగత మరియు వృత్తిపర విషయాల్లో ఓపెన్ గా మాట్లాడుతున్నారు.


తాజాగా తేజస్విని ఓ ఇంటర్వ్యూలో కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె అనేక ఆసక్తికర సంగతులు పంచుకున్నారు. ఈ క్రమంలోనే తన క్వాలిఫికేషన్ ఏంటో రివీల్ చేసి అందరి ఫ్యూజులు ఎగిరిపోయేలా చేశారు. చదువుల్లో తేజస్విని తోపు. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన తేజ‌స్విని.. త‌ప స్కూలింగ్‌ సెయింట్ ఆన్స్‌లో, ఇంటర్‌ శ్రీ చైతన్యలో కంప్లీట్ చేసింది. కస్తూరిబా గాంధీ కాలేజీలో డిగ్రీ, నాచారంలోని సెయింట్ పియస్ కాలేజీలో బయోకెమిస్ట్రీలో పీజీ పూర్తిచేశారు.


తేజ‌స్విని త‌ల్లి హైకోర్ట్ అడ్వకేట్. అందువ‌ల్ల ఆమె కూడా లా ప‌ట్ల ఆస‌క్తి పెంచుకుంది. ఆ కార‌ణంగానే పీజీ అనంత‌రం పెండేకంటి లా కాలేజీలో లా చదవడం ప్రారంభించింది. అదే టైమ్‌లో దిల్ రాజుతో తేజ‌స్విని వివాహం జ‌రిగింది. రెండేళ్ల‌కే కొడుకు కూడా పుట్టాడు. అలా అని తేజ‌స్విని చ‌దువుల‌ను విస్మ‌రించ‌లేదు. పెళ్లై బిడ్డ పుట్టాక సైతం స్ట‌డీస్ ను కంటిన్యూ చేసిన తేజ‌స్విని.. 2024లో లా పూర్తి చేశారు. తాజా ఇంట‌ర్వ్యూలో ఈ విష‌యాన్ని ఆమె స్వ‌యంగా వెల్ల‌డించ‌డంతో ఆశ్చ‌ర్య‌పోవ‌డం నెటిజ‌న్ల వంతైంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: