పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ కామెడీ హారర్ ఫిల్మ్ `ది రాజా సాబ్`. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్స్ కాగా.. సంజయ్ దత్ ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో నిర్మితమవుతున్న ఈ చిత్రానికి తమ‌న్‌ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే బయటకు వచ్చిన పోస్టర్స్, గ్లింప్స్‌, టీజ‌ర్‌ సినిమాపై అంచనాలను తారస్థాయిలో పెంచేశాయి.


డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గా ఈ మూవీ గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. అయితే ఆల్రెడీ ముగ్గురు హీరోయిన్లు ఉండ‌గా.. రాజా సాబ్ కోసం మరో స్టార్ బ్యూటీని రంగంలోకి దింపే పనిలో పడ్డాడట డైరెక్టర్ మారుతిసినిమా షూటింగ్ ఆల్మోస్ట్ ముగింపు దశకు చేరుకుంది. ఇంకా ఒక సాంగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. అది కూడా ఒక‌ ఐటమ్ సాంగ్. ప్ర‌భాస్ ఫ్యాన్స్ కోసం ప్ర‌త్యేకంగా ఈ పాట‌ను ప్లాన్ చేశారు.


అయితే ఈ ఐటమ్‌ సాంగ్ ను బాలీవుడ్ ఆగ్ర తార కరీనా కపూర్ చేత చేయించాలని మేకర్స్ భావిస్తున్నారట. ఇప్పటికే ఆమెతో సంప్ర‌దింపులు కూడా ప్రారంభించార‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి క‌రీనా రాజా సాబ్‌లో న‌ర్తించేందుకు ఓకే చెప్పేనా? లేదా? అన్న‌ది తెలియాల్సి ఉంది. ఒక‌వేల క‌రీనా ప్ర‌భాస్‌తో ఆడిపాడేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిందంటే.. స్క్రీన్స్ షేక్ అవ్వ‌డం ఖాయం. పైగా ఆమెకు రెమ్యున‌రేష‌న్ కూడా భారీగా చెల్లించుకోవాల్సి ఉంటుంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: