మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో `విశ్వంభర` ఒకటి. మల్లిడి వసిష్ఠ డైరెక్ట్ చేస్తున్న ఈ సోషియో ఫాంటసీ చిత్రంలో త్రిష, ఆషికా రంగ‌నాథ్ హీరోయిన్లు. యూవీ క్రియేషన్స్ పతాకంపై చిరంజీవి కెరీర్‌లోనే హైయెస్ట్ బ‌డ్జెట్ తో నిర్మిత‌మ‌వుతున్న ఈ చిత్రంలో మెగా ఫ్యాన్స్ కోసం ఈ మాస్ మ‌సాలా ఐటెం సాంగ్‌ను మేక‌ర్స్ ప్లాన్ చేశారు. ఈ పాట కోసం ప్ర‌త్యేకంగా ప్ర‌ముఖ మ్యూజిక్ డైరెక్ట‌ర్ భీమ్స్ సిసిరోలియోను రంగంలోకి దింప‌డం కూడా జ‌రిగింది.


కానీ విశ్వంభ‌ర ఐటెం సాంగ్ లో చిరంజీవితో క‌లిసి స్టెప్పులేసి బ్యూటీ ఎవ‌రు అన్న విష‌యంపై ఇంకా కన్ఫ్యూజ‌న్ ర‌న్ అవుతూనే ఉంది. మొద‌ట యంగ్ సెన్షేష‌న్ శ్రీ‌లీల విశంభ‌ర‌లో ఐటెం సాంగ్ చేయ‌బోతుంద‌ని టాక్ న‌డించింది. ఆ త‌ర్వాత దక్ష నగార్కర్ చిరంజీవితో పాటు నర్తించే అదృష్టాన్ని సొంతం చేసుకుంద‌ని ప్ర‌చారం జ‌రిగింది. మొన్నీమ‌ధ్య  క‌న్నడ ప‌రిశ్ర‌మ నుండి హాట్ బ్యూటీ నిశ్వికా నాయుడును మేక‌ర్స్ సెల‌క్ట్ చేసిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి.
అయితే తాజాగా మ‌రో కొత్త భామ పేరు తెర‌పైకి వ‌చ్చింది. `నాగిని` సీరియ‌ల్‌తో దేశ‌వ్యాప్తంగా భారీ క్రేజ్ సంపాదించుకున్న బాలీవుడ్ బ్యూటీ మౌని రాయ్ ని  స్పెషల్ సాంగ్ కోసం చిత్ర‌బృందం అప్రోచ్ అయినట్టుగా సోష‌ల్ మీడియాలో వార్త‌లు ట్రెండ్ అవుతున్నాయి. మౌని రాయ్ కూడా విశ్వంభ‌ర‌లో చిరుతో క‌లిసి ఐటెం సాంగ్ చేసేందుకు ఒప్పుకుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఈ ప్ర‌చారం ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియాలంటే అధికారిక ప్ర‌ట‌క‌న రావాల్సిందే.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: