
అంతేకాకుండా కొన్ని సందర్భాలలో వీరిద్దరూ కలిసి షేర్ చేసే ఫోటోలు కూడా మరింత రూమర్స్ కి స్థానం కల్పించాయి. ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలు ఏమిటంటే త్వరలోనే సమంత, రాజ్ పెళ్లి చేసుకోబోతున్నారని ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా తెరవెనక జరుగుతున్నాయనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. శుభం సినిమా సక్సెస్ మీట్ లో సమంత పక్కనే రాజ్ ఉండడంతో ఈ విషయం మరింత చర్చనీయాంశంగా మారింది. రూమర్స్ ని సమంత కొన్నిసార్లు ఖండించిన వైరల్ గానే మారుతున్నాయి.అంతేకాకుండా రాజ్ నిడుమోర్ భార్య కూడా ఈ మధ్యకాలంలో పలు రకాల కొటేషన్స్ తో షేర్ చేయడంతో ఈ వార్తలకు మరింత స్థానం కల్పిస్తోంది.
గతంలో సమంత మాత్రం ఇక రెండో పెళ్లి చేసుకోను అన్నట్లుగా తెలియజేసింది. మరి ఇప్పుడు వినిపిస్తున్న ఈ రూమర్స్ పైన ఏవిధంగా క్లారిటీ ఇస్తుందో చూడాలి. అటు సమంత, రాజ్ ఇద్దరు కలిసి పలు రకాల వెబ్ సిరీస్లలో కూడా నటించారు. సమంత ఖుషి సినిమా తర్వాత మళ్లీ ఏ సినిమాలో కూడా కనిపించలేదు. ఒక లేడీ ఓరియంటెడ్ చిత్రాన్నీ తన బ్యానర్ లోని ప్రకటించిన కొన్ని కారణాల చేత పోస్ట్ పోన్ అయినట్లు సమాచారం. ప్రస్తుతం నిర్మాతగా అయితే కొనసాగుతున్నట్లు సమాచారం.