
ఈ జాబితాలో ముందుంది `తెలుసు కదా`. నీరజ కోన డైరెక్ట్ చేస్తున్న ఈ రొమాంటిక్ డ్రామాలో సిద్ధు జొన్నలగడ్డ హీరో కాగా.. రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 17న రాబోతోంది. ఇప్పటికే రిలీజ్ డేట్‌పై అధికారిక ప్రటకన కూడా వెలువడింది.
దీపావళి రేసులోకి యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం కూడా దిగబోతున్నాడు. ప్రస్తుతం కిరణ్ `కె-ర్యాంప్` అనే మూవీ చేస్తున్నాడు. హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్లపై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో యుక్తి తరేజా హీరోయిన్. రీసెంట్ గా బయటకు వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా సినిమా దీపావళికి రాబోతున్నట్లు మేకర్స్ కన్ఫార్మ్ చేశారు.
అధికారికరంగా ఈ రెండు చిత్రాలతో పాటు మరికొన్ని సినిమాలు కూడా దీపావళిని టార్గెట్ చేస్తున్నాయి. ముఖ్యంగా `లవ్ టుడే`, `డ్రాగన్` చిత్రాలతో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న ప్రదీప్ రంగనాధన్ ఇప్పుడు `డ్యూడ్` అనే మూవీ చేస్తున్నాడు. ఈ ఏడాది దీపావళికి తెలుగు, తమిళ భాషల్లో డ్యూడ్ విడుదల అయ్యే ఛాన్సులు ఉన్నాయి.
అలాగే సూర్య, ఆర్జే బాలాజీ కాంబోలో రూపుదిద్దుకుంటున్న `కరుప్పు` దీపావళి బరిలో దిగేందుకు రెడీ అవుతోంది. మరోవైపు సూర్య సోదరుడు కార్తి హీరోగా `సర్దార్ 2` తెరకెక్కుతోంది. 2022 దీపావళికి సర్దార్ వచ్చి బ్లాక్ బస్టర్ అయింది. ఈ నేపథ్యంలోనే సర్దార్ 2ను కూడా దీపావళికి రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. అయితే అన్నదమ్ములిద్దరూ బాక్సాఫీస్ వద్ద పోటీ పడే అవకాశం లేదు. సో.. సూర్య, కార్తిలలో ఎవరో ఒకరు వెనక్కి తగ్గడం ఖాయం. ఇక రామ్ `ఆంధ్ర కింగ్ తాలూకా` సెప్టెంబర్ ను మిస్ చేసుకుంటే అక్టోబర్ లో దీపావళికి విడుదల అయ్యే అవకాశం ఉంది.