
మాజీ మిస్ యూనివర్సిటీ అయినప్పటికీ ఒకప్పుడు చావు అంచుల దాకా వెళ్లి వచ్చాను అంటూ తెలియజేస్తోంది. తీవ్రమైన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నప్పటికీ అభిమానుల కోసం తాను ఎనర్జిటిక్ గా కనిపించేదాన్ని అంటూ వెల్లడించింది. మొన్నటి వరకు ప్రతి ఎనిమిది గంటలకు ఒకసారి తాను స్టెరాయిడ్ తీసుకునే దాన్ని అంటూ వెల్లడించింది.ఆమె తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు ఆమె ఆరోగ్యంగా ఉండేలా చేసిందంటూ వెల్లడించింది సుస్మితాసేన్.
2014 నుంచి ఆమె ఆటో ఇమ్యూన్ డిజార్డర్ డిసీజ్ తో ఇబ్బంది పడుతున్నట్లు వెల్లడించింది. తన శరీరంలో కార్డీసోల్ అనే హార్మోన్ ఉందన్నట్లుగా వైద్యులు తెలియజేశారని తెలిపింది. ఇది చాలా ప్రాణాంతకరమైనదని దీన్ని సరి చేయాలి అంటే ప్రతి ఎనిమిది గంటలకు ఒకసారి హైడ్రో కార్డిసోన్ అనే స్టెరాయిడ్ ఇంజక్షన్ ని చేసుకోవాలని వైద్యులు చెప్పారట. అంతేకాకుండా బరువైన పనులు, వ్యాయాలు వంటివి చేయకూడదని హెచ్చరించారట. దీంతో తాను తన ఫిట్నెస్ కోచ్ ని పిలిపించుకొని మరి జిమ్ స్టిక్స్ వంటివి ప్రాక్టీస్ చేసిందట. కానీ ఒకసారి తీవ్రమైన అస్వస్థకు గురికావడంతో దుబాయ్ నుంచి అబుదాబుకి వెళ్లి అక్కడ చికిత్స చేయించుకున్నానని.. అక్కడ టర్కీ వైద్యులు తనకి ఆడ్రిల్ గ్రంధి సరిగ్గా పనిచేస్తుందని చెప్పారట. అయితే అక్కడ వైద్యులు కూడా ఇలా జరగడం చూసి ఆశ్చర్యపోయారని ఆ విషయం చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారని తెలిపింది సుస్మిత.. తెలుగులో ఈమె రక్షకుడు అనే సినిమాలో నాగార్జునకు జోడిగా నటించింది. ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నారని వెల్లడించింది.